
మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ టాలీవుడ్‌లో దూసుకెళ్తోంది. ఇటీవలే నాని సినిమా దసరాతో ప్రేక్షకులను అలరించింది. సింగరేణి బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం తమిళంలోనూ ఆమె నటించిన మామన్నన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లోనూ ఆమె పాల్గొన్నారు.
(ఇది చదవండి: తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా? )
కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం మెగాస్టార్ చిత్రం భోళాశంకర్‌లో నటిస్తోంది. తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘వేదాళం’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లిలిగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగింది. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది.
ఈ సందర్బంగా హైదరాబాద్‌కు వచ్చిన కీర్తి సురేశ్ సిటీలో చక్కర్లు కొట్టింది. ఎవరూ గుర్తు పట్టకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్‌కు వచ్చిన కీర్తి సురేశ్ టిఫిన్ చేశారు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇష్టమైన తందూరీ టీ తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. బయట ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ ధరించిన కీర్తి సురేశ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
(ఇది చదవండి: రామాలయానికి 100 టిక్కెట్లు ఉచితం)
Comments
Please login to add a commentAdd a comment