‘శ్యామ్ సింగరాయ్’తో మంచి సక్సెస్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.ఇప్పటికే ‘అంటే సుందరానికీ’ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న నాని.. ప్రస్తుతం ‘దసరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి నాని లుక్‌ని వదిలారు మేకర్స్. అందులో నాని లుంగీ కట్టి ఊర మాస్‌గా కనిపిస్తున్నాడు. తల నుంచి రక్తం కారుతుండగా..అలా నడుస్తూ..మంటల్లోంచి చేతులు తీసి సిగరేట్ అటించాడు నాని. అక్కడి గ్రామస్తులు అంతా భయంతో అతని వెనుక నడుచుకుంటూ వస్తున్నారు. నాని కాళ్లు మొత్తం మట్టితో నిండిపోవడం చూస్తుంటే.. ఇది ఏదో మాస్ ఫైట్‌కు సంబంధించిన సన్నివేశం అని అర్థమవుతుంది. ఇక ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment