కాలం వెనక్కి వెళ్లే కథలు.. రీల్‌లైఫ్‌లో అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తున్న సినిమాలివే | List Of Movies Which Has Periodic Background | Sakshi
Sakshi News home page

కాలం వెనక్కి వెళ్లే కథలు.. రీల్‌లైఫ్‌లో అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తున్న సినిమాలివే

Published Mon, Jan 9 2023 9:29 AM | Last Updated on Mon, Jan 9 2023 9:33 AM

List Of Movies Which Has Periodic Background - Sakshi

2023లో ఉన్నప్పుడు 40, 50, 60 ఏళ్లు... అంతకుమించి వెనక్కి వెళ్లే అవకాశం వస్తే...? రియల్‌ లైఫ్‌లో సాధ్యం కాకపోవచ్చు. కానీ రీల్‌ లైఫ్‌లో ఏదైనా సాధ్యమే. కాలం వెనక్కి వెళ్లొచ్చు.. ముందుకూ వెళ్లొచ్చు. ఇప్పుడు కాలం వెనక్కి వెళ్లే కథలు వెండితెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.

స్టువర్టుపురం దొంగగా ముద్రపడిన టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’. హీరో రవితేజ టైటిల్‌ రోల్‌లో వంశీ దర్శకత్వంలో అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టువర్టుపురంలో 1970–1980 కాలంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. వీలైనంత త్వరగా ఈ చిత్రం పూర్తి చేసి ఈ ఏడాదే థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారు మేకర్స్‌. ఇక పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం హీరోగా చేస్తున్న చిత్రాల్లో ‘సలార్‌’ ఒకటి. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందన్న టాక్‌ ఆల్రెడీ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న ‘సలార్‌’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానుంది.

మరోవైపు రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ క్యారెక్టర్‌లో షేడ్స్‌ ఉంటాయి. రామ్‌చరణ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి పాత్ర సన్నివేశాలన్నీ 1960–1970 బ్యాక్‌డ్రాప్‌కి సంబంధింనవని తెలిసింది. ఐఏఎస్‌ ఆఫీసర్ల నేపథ్యంలో పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఇంకోవైపు అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రకథ 1990 బ్యాక్‌డ్రాప్‌ నుంచే ఆరంభం అవుతుంది. రెండు భాగాల ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ గత ఏడాది డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్‌’ నిర్మాణంలో ఉంది. ఈ సినిమాకు కూడా 1990 బ్యాక్‌డ్రాప్‌ ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వర్లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వేసవిలో థియేటర్స్‌లో ఆడియన్స్‌కు ‘దసరా’ చూపేందుకు రెడీ అవుతున్నారు హీరో నాని. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1980–1990 బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల పరిసర  ప్రాంతాల్లో ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిసింది. ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితులను ధరణి (నాని) ఏ విధంగా పరిష్కరించాడు, వెన్నెల (ఇందులో హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ పాత్ర)తో అతని లవ్‌స్టోరీ ఏమైంది? అన్నదే ‘దసరా’ ప్రధాన కథాంశం.

మరోవైపు ‘డెవిల్‌’ సినిమా కోసం 1945వ కాలం నాటి బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా మారిపోయారు కల్యాణ్‌ రామ్‌. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్‌వాళ్లు పరి΄ాలింన మద్రాస్‌ ప్రెసిడెన్సీలో జరిగిన కొన్ని రహస్య అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి సంబంధించి ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని ఛేదించడానికి గూఢచారిగా కల్యాణ్‌ రామ్‌ ఏం చేశారు? అన్నదే ‘డెవిల్‌’ కథాంశం. నవీన్‌ మేడారం దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లోకి రానుంది. ఇంకోవైపు ‘హరోం హర’ అంటున్నారు హీరో సుధీర్‌బాబు. జ్ఞాన సాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘ది రివోల్ట్‌’ అనేది క్యాప్షన్‌. సుమంత్‌. జి నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగుతుంది.

తమిళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు ఉన్నాయి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా వీరి కాంబినేషన్‌లోనే ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రధానంగా స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1920–1930 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇక ధనుష్‌ హీరోగా నటిస్తున్న తాజా ΄ాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ది 1930–1940 బ్యాక్‌డ్రాప్‌ అని త్ర యూనిట్‌ ఆల్రెడీ ప్రకటింంది. అరుణమాదేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్, సందీప్‌ కిషన్‌ కీ రోల్స్‌ చేస్తున్నారు. ఈ చిత్రాలే కాదు.. దర్శకుడు వెట్రిమారన్‌తో సర్య కమిట్‌ అయిన ‘వాడివాసల్‌’, శివ దర్శకత్వంలో సర్య చేస్తున్న 42వ సినిమాలు కూడా గతంలోకి తీసుకెళ్లేవే.

1990 బ్యాక్‌డ్రాప్‌ అంటే బొమ్మ హిట్టే అని గత ఏడాది బాక్సాఫీస్‌ లెక్కలు చెబుతున్నాయి. హిట్‌ రిపీట్‌ అయితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి.. రిపీట్‌ అవ్వాలని కోరుకుంటుంటారు. గత ఏడాది తెలుగులో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలి, బాక్సాఫీస్‌ వద్ద దాదాపు ర. 1300 కోట్ల గ్రాస్‌ను వసలు చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా 1920 బ్యాక్‌డ్రాప్‌లో ర΄÷ందింది. ఇక సువరు 90 కోట్ల ర΄ాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టి సపర్‌హిట్‌గా నిలిన ‘సీతారామం’ చిత్రకథ 1964–1985 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలే కాదు... బాక్సాఫీస్‌ వద్ద ర. 1100 కోట్లు రాబట్టిన ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 (1980 నేపథ్యంలో...), ర. 400 కోట్లకు పైగా వసలు చేసిన కన్నడ బ్లాక్‌బస్టర్‌ ‘కాంతార’ (కథ 1847లో స్టార్ట్‌ అయినా మేజర్‌ కథాంశం, స్క్రీన్‌ ప్లే..1990 బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది), హిందీలో ర. 300కోట్లకు పైగా వసలు చేసిన సపర్‌హిట్‌ మూవీ ‘ది కశ్మీరీ ‡ఫైల్స్‌’ (స్క్రీన్‌ ప్లే 2020లో స్టార్ట్‌ అయినా... కథ మేజర్‌గా 1989–1990 నేపథ్యంలోనే సాగుతుంది) కొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లే చిత్రాలే కావడం విశేషం. ఈ జాబితాలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.

యాక్షన్, థ్రిల్లర్‌ అంశాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ‘విరసాక్ష’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు సాయిధరమ్‌ తేజ్‌. 1990 నేపథ్యంలో ఓ ఫారెస్ట్‌ బేస్డ్‌ విలేజ్‌లో సాగే థ్రిల్లర్‌ సినిమా ఇది. మూఢ నమ్మకాలు, సైన్స్, ఆధ్యాత్మిక అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్‌. కార్తీక్‌ దండు దర్శకత్వంలో బీవీఎన్‌ఎస్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాలే కాదు... 1990ల నేపథ్యంలో రూపొందుతోన్న మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement