
'చమ్కీల అంగిలేసి' పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దసరా సినిమాలోని ఈ పాట కొన్ని రోజుల నుంచి ఇన్‌స్టా రీల్స్‌లో దుమ్మురేపుతుంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా చమ్కీల అంగిలేసి పాటకు మంచు లక్ష్మీ తన కూతురితో కలిసి చిందులేసింది.
పింక్ కలర్ చీరలో లిరిక్స్‌కు తగ్గట్లు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. దసరా చిత్రం విజయవంతం కావాలంటూ బెస్ట్ విషెస్‌ను అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా దసరా మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఆకట్టుకుంటుంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment