పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్‌ | Hero Nani Dasara Movie Song Shoot At Peddapalli District Godavarikhani | Sakshi
Sakshi News home page

Dasara Movie: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్‌

Published Tue, Apr 12 2022 8:05 AM | Last Updated on Tue, Apr 12 2022 12:40 PM

Hero Nani Dasara Movie Song Shoot At Peddapalli District Godavarikhani - Sakshi

Nani-Keerthi Suresh Song Shoot At Godavarikhani: నాని హీరోగా నటిస్తున్న ఫుల్‌ మాస్, యాక్షన్‌ ప్యాక్డ్‌ చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరుగుతోంది. నాని, కీర్తిలపై పాటని చిత్రీకరిస్తున్నారు.

చదవండి: స్టార్‌ హీరో అయ్యుండి ఇలా చేస్తారనుకోలేదు: విజయ్‌పై పూజా కామెంట్స్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ‘నాటు నాటు..’ పాటకి కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ ఈ పాటకు నృత్యరీతులు సమకూరుస్తున్నారు. నాని, కీర్తి, 500 మంది డ్యాన్సర్లతో ఈ పాట షూటింగ్‌ జరుగుతోంది. ‘‘మాస్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘దసరా’ రూపొందుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్‌ ఇండియా చిత్రం ఇది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూర్యన్, సంగీతం: సంతోష్‌ నారాయణన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ చాగంటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement