
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మార్చి 30న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీకాంత్ ఓదెల సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దసరా పోస్టర్‌లో సిల్క్ స్మిత ఫోటో ఉండడంపై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.
శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. 'నా చిన్నప్పుడు మా తాతకు కాళ్లు విరిగిపోయాయి. తాతా కల్లు తీసుకురామంటే వెళ్లా. కల్లు దుకాణంలో ఫస్ట్ టైమ్ సిల్క్ స్మిత ఫోటో చూశా. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆమెను చూస్తూనే ఉన్నా. ఆ తర్వాత అనిపించింది నాకు. ఆమెలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలేమో. ఆమెకు ఫ్యాషనేట్ సినిమాలంటే పిచ్చి అని విన్నాను. చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్‌లో అలా ఉండిపోయింది. అందుకే కల్లు దుకాణం వద్దే సిల్క్ స్మిత ఫోటో పెట్టా.' అని అన్నారు. అయితే కీర్తి సురేశ్‌ను ఈ విషయంపై చాలామంది అడిగారని ఆమె చెప్పుకొచ్చారు.
'Dasara' Mass Jaathara ki sarvam siddham 🔥🔥
— srikanth odela (@odela_srikanth) August 26, 2022
Natural Star @NameisNani's #Dasara Grand Release on 30 MARCH 2023 💥💥#EtlaitheGatlaayeSuskundhaam 🤙@KeerthyOfficial @Music_Santhosh @sathyaDP @NavinNooli @sudhakarcheruk5 @SLVCinemasOffl pic.twitter.com/6Fi0YN80A9