
నేచరల్ స్టార్ నాని కెరీర్‌లో తొలిసారి నటించిన పాన్ ఇండియా చిత్రం 'దసరా'. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడు. గోదావరి ఖని బొగ్గు గనుల నేపథ్యంలో మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
అటు కీర్తిసురేష్ కూడా మహానటి తర్వాత ఆ స్థాయిలో ఇరగదీసిందని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే దసరా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దసరా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందే భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ డీల్‌ను కుదుర్చుకున్నట్లు సమాచారం.థియేట్రికల్ రన్ ముగిసిన 6-7వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.