
‘‘సినిమాలకు ఇప్పుడు భాష లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ వంటి సినిమాలను ఇండియన్ సినిమాల్లానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం’’ అన్నారు కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి. నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేసిన దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ధరణి (నానిపాత్ర పేరు) క్లోజ్ ఫ్రెండ్ సూరిపాత్రలో కనిపిస్తాను. మంచి కథకు అన్ని అంశాలు మిళితమై ఉన్న మంచి వినోదాత్మక చిత్రం ‘దసరా’. ఇలాంటి సినిమాలో భాగం కావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకావం రావడాన్నే నేను ఒక సక్సెస్‌లా భావిస్తున్నాను. నానీగారి నుంచి చాలా నేర్చుకున్నాను. నన్ను నమ్మి చాన్స్ ఇచ్చిన సుధాకర్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment