Dixit
-
Hyderabad: భార్యతో గొడవపడి అర్ధరాత్రి పోర్షే కారులో చక్కర్లు..
బంజారాహిల్స్: భార్యతో గొడవపడి అర్ధరాత్రి ఖరీదైన పోర్షే కారులో చక్కర్లు కొడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్ళి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యాపారి, స్టాండప్ కమేడీయన్ ఉత్సవ్ దీక్షిత్‌ను ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయగా ప్రమాదానికి కారణమైన పోర్షేకారు కండీషన్ తెలియజేయాల్సిందిగా జర్మనీ కంపెనీకి బంజారాహిల్స్ పోలీసులు లేఖ రాయనున్నారు. ఇప్పటికే లేఖను సిద్ధం చేసిన పోలీసులు నేడో, రేపో ఈ కారు కండీషన్ తెలియజేయాల్సిందిగా కోరనున్నారు. ఈ కారు మరమ్మతులకు వచ్చిందని మూడునెలల క్రితమే సర్వీస్ కు తేవాలని చెప్పామని రోడ్లపైకి తీసుకెళ్ళవద్దని హెచ్చరించడం కూడా జరిగిందని షోరూం ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదేదీ పట్టని ఉత్సవ్ దీక్షిత్ మూడునెలల నుంచి కారును నడిపిస్తూనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వేగంతో కారును నడపడంతో మూల మలుపు వద్ద కారు స్టీరింగ్‌కు లాక్ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు కండీషన్లో ఉందా లేదా తేల్చాల్సిందిగా పోర్షే కంపెనీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సంబంధిత కంపెనీ నుంచి నిపుణులు వచ్చి కారు కండీషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు -
ది గ్రేట్ వడా పావ్ వార్
దిల్లీ ‘వైరల్ వడా పావ్ గర్ల్’గా పాపులర్ అయిన చంద్రికా గెరా దీక్షిత్ తాజాగా తన ఫుడ్ కార్ట్ సార్టప్తో రాత్రికి రాత్రి సెన్సేషన్‌గా మారింది. దీక్షిత్ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్ ఫుడ్ కార్ట్ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్‌లైన్స్ నెటిజనుల నుంచి లైన్ కట్టాయి. ‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్. ఫుడ్ వ్లాగర్ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్‌గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది. -
యువ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ: ఎప్పుడూ అవే పాటలా.. పాకెట్ ప్రపంచంలోకి
ప్రయాణంలో, తీరిక వేళల్లో ఎఫ్ఎంలో పాటలు వినడం సహజమే. ‘ఎప్పుడూ అవే పాటలు, అవే మాటలేనా’ అనుకుంటారు కొద్దిమంది. వారిలో రోహన్ నాయక్ ఒకరు. ఈ యువ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన ‘పాకెట్ ఎఫ్ఎం’ వివిధ జానర్స్, వివిధ భాషలలో ఆకట్టుకునే ఆడియో సిరీస్‌లతో దూసుకుపోతుంది... కొన్నిసార్లు ఐడియాల కోసం వెదుక్కుంటూ వెళ్లనక్కర్లేకుండానే... అవే మనల్ని వెదుక్కుంటూ వస్తాయి. రోహన్ నాయక్ విషయంలోనూ అలాగే జరిగింది. ఇంటి నుంచి ఆఫీసుకు చేరుకోవడానికి చాలా టైమ్ పట్టేది. టైమ్‌పాస్ కోసం ఎఫ్‌ఎంలలో మ్యూజిక్ వినేవాడు. అయితే ఆ మ్యూజిక్ అదేపనిగా రిపీట్ కావడంతో బోర్‌గా ఉండేది. ‘భారతీయ భాషల్లో ఆడియో స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ఉంటే బాగుండేది’ అనుకునేవాడు. ‘మనం కావాలనుకుంటున్నది కాలమే మన చేత చేయిస్తుంది’ అన్నట్లుగా ఆ ప్రయత్నానికి తానే శ్రీకారం చుట్టాడు రోహన్ నాయక్. ఐఐటీ–ఖరగ్‌పూర్ ఫ్రెండ్స్ ప్రతీక్ దీక్షిత్, నిశాంత్ కేఎస్లతో కలిసి ‘పాకెట్ ఎఫ్.ఎం’కు శ్రీకారం చుట్టాడు. మ్యూజిక్ కాకుండా ‘ఆడియో ఎంటర్టైన్మెంట్’ లక్ష్యంగా మొదలైన ఈ ఆడియో సిరీస్ ప్లాట్‌ఫామ్ అన్యూవలైజ్డ్ రెవెన్యూ రన్‌రేట్(ఏఆర్ఆర్)తో దూసుకుపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘ప్రస్తుతం శ్రోతలు సగటున రోజుకు వంద నిమిషాల సమయాన్ని వినడానికి వెచ్చిస్తున్నారు. మా యాప్ టోటల్ మంత్లీ ఆడియో స్ట్రీమింగ్‌లో ఎప్పటికప్పుడు వృద్ధి కనిపిస్తోంది’ అంటున్నాడు పాకెట్ ఎఫ్.ఎం. ఫౌండర్లలో ఒకరైన నిశాంత్. రొమాన్స్, హారర్, థ్రిల్లర్, ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్...అనేవి పాకెట్ ఎఫ్.ఎం.లో టాప్ జానర్లుగా ఉన్నాయి. ఎపిసోడ్లు 10–15 నుంచి 25–30 నిమిషాల వరకు ఉంటాయి. ‘పాకెట్ ఎఫ్.ఎం’ ఆడియో సెగ్మెంట్ సిరీస్‌లో కొన్ని హిట్ టైటిల్స్... యే రిష్తా కైసా హై(400 మిలియన్), లవ్ కాంట్రాక్ట్(200 మిలియన్), యక్షిణీ (195 మిలియన్), షూర్వీర్(129 మిలియన్)...మొదలైనవి. ‘పాకెట్ఎఫ్ఎం’లో 733 ఆడియో సిరీస్‌లతో పాటు ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. గత అక్టోబర్‌లో ఆన్లైన్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ‘పాకెట్ నావెల్’కు శ్రీకారం చుట్టారు. ఇక శ్రోతల విషయానికి వస్తే 15 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు, ముంబై, దిల్లీ, పుణె, హైదరాబాద్‌లు టాప్ 5 సిటీస్‌గా ఉన్నాయి. మరోవైపు చిన్న పట్టణాలలో కూడా ‘పాకెట్ఎఫ్ఎం’ పాపులర్ అవుతుంది. లాంగ్ ఫార్మట్ ఆడియో ఎంటర్టైన్మెంట్ సిరీస్ ద్వారా ఒటీటీ స్పేస్‌ను పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్న ‘పాకెట్ ఎఫ్ఎం’ యాడ్–టెక్ ప్లాట్‌ఫామ్ ‘రియల్ టైమ్ యాడ్స్’ను తీసుకువచ్చింది. ‘పాకెట్ ఎఫ్ఎం విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది’ అంటున్నాడు కంపెనీ సీటీవో ప్రతీక్ దీక్షిత్. కంపెనీకి లైట్‌స్పీడ్, టెన్సెంట్, టైమ్స్ ఇంటర్నెట్లాంటి కీ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇప్పుడు పాకెట్ ఎఫ్.ఎం. యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ‘టీమ్ మెంబర్స్‌కు అద్భుతమైన శక్తి,సామర్థ్యాలు, అంకితభావం ఉన్నాయి’ అంటున్నాడు టాంగ్లిన్ వెంచర్ పార్ట్నర్స్కు చెందిన సంకల్ప్ గుప్తా. పాకెట్ ఎఫ్.ఎం.ను ‘నెట్‌ఫ్లిక్స్ ఆఫ్ ఆడియో వోటీటీ ప్లాట్‌ఫామ్స్’ గా తీర్చిదిద్దాలనేది ముగ్గురు విజేతల లక్ష్యం. పాకెట్ ఎఫ్.ఎం. విజయవంతం కావడంలో ఎఐ, ఎంఎల్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. శ్రోతల నాడి పసిగట్టడం, సంక్లిష్టమైన విషయాలను సరళం చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం... ఇలా ఎన్నో విషయాల్లో సాంకేతికత ఉపయోగపడింది. – ప్రతీక్ దీక్షిత్ -
అతనికి జీవితాంతం రుణపడి ఉంటాను: దీక్షిత్ శెట్టి
‘‘సినిమాలకు ఇప్పుడు భాష లేదు. ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ వంటి సినిమాలను ఇండియన్ సినిమాల్లానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం’’ అన్నారు కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి. నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేసిన దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ధరణి (నానిపాత్ర పేరు) క్లోజ్ ఫ్రెండ్ సూరిపాత్రలో కనిపిస్తాను. మంచి కథకు అన్ని అంశాలు మిళితమై ఉన్న మంచి వినోదాత్మక చిత్రం ‘దసరా’. ఇలాంటి సినిమాలో భాగం కావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకావం రావడాన్నే నేను ఒక సక్సెస్‌లా భావిస్తున్నాను. నానీగారి నుంచి చాలా నేర్చుకున్నాను. నన్ను నమ్మి చాన్స్ ఇచ్చిన సుధాకర్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు. -
దీక్షిత్ ఆశ్రమాల నుంచి మరో 53 మందికి విముక్తి
న్యూఢిల్లీ: ‘ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ్’స్థాపకుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కేంద్రాల్లో మూడింటిపై శనివారం దాడులు చేసిన పోలీసులు 47 మంది మహిళలు, ఆరుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ్ అనే ఆశ్రయంలో వందల సంఖ్యలో మహిళలు, బాలికలను బంధించి వారిపై లైంగిక దాడులు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి కేంద్రాలు మరో 8 ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు దృష్టికి రావడంతో వాటిలో కూడా సోదాలు జరపాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అందులో భాగంగానే పోలీసులు శనివారం ఆయా కేంద్రాలపై దాడులు చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లోనివారు పోలీసులను లోపలకు రానివ్వకపోవడంతో పక్కనున్న భవంతులపైకి ఎక్కి వారు లోపలకు ప్రవేశించారు. గురువారం రోహిణిలోని కేంద్రంపై జరిగిన దాడుల్లోనూ 41 మంది అమ్మాయిలను రక్షించడం తెలిసిందే. -
‘చిదంబరం’ దీక్షితులదే!
చె న్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం తగదని పేర్కొంటూ వంశపారపర్య దీక్షితులకే నిర్వహణా బాధ్యతను అప్పగిస్తూ సోమవారం సుప్రీం కోర్టు సోమవారం తీర్పుచెప్పింది. దీంతో సుమారు 15 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కడలూరు జిల్లా కుముడిమూలై గ్రామానికి చెందిన శివనడియార్ ఆరుముగస్వామి (90)కి చిదంబరం ఆలయంలో దేవారం(సంప్రదాయ భక్తిగీతాలు) పాడటం అలవాటు. దేవారం పాడేందుకు వెళ్లిన ఆర్ముగంపై 2000లో ప్రధాన అర్చకులు దాడిచేసి తరిమేశారు. ఆరుముగానికి జరిగిన అవమానంపై తమిళ భాషాభిమానులు, పీఎంకే పార్టీ నాయకులు కలిసి మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. పోరాటాలు సాగించి ప్రభుత్వానికి విజ్ఞప్తులు సమర్పించారు. 2008లో అప్పటి డీఎంకే ప్రభుత్వం ఆలయంలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేసి ఆరుముగం చేత దేవారం పాడించింది. ప్రభుత్వ చర్యకు తీవ్రమనస్థాపంతో అర్చకులు నిరసనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆలయాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుని నిర్వహణ బాధ్యతను ట్రస్టీలకు అప్పగించి కమిషనర్‌ను నియమించింది. ఆలయాన్ని ప్రభుత్వ స్వాధీనం నుంచి తప్పించాలని కోరుతూ వంశపారంపర్య ప్రధాన అర్చకులు, దీక్షితులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఇంతలో రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వంపోయి అన్నాడీఎంకే అధికారంలోకి రావడంతో ప్రభుత్వ తరపున న్యాయవాది నియమితులు కాలేదు. ప్రభుత్వం అర్చకులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే సీనియర్ న్యాయవాదిని నియమించాలని, అర్చకులకు అనుగుణంగా వ్యవహరించరాదని ఆరుముగస్వామి డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయవాదిని నియమించకుంటే ప్రాణాలు పోయేంతవరకు ఆలయంలో దేవారం పాడుతానని గత ఏడాది నవంబరు 2వ తేదీన ఆయన హెచ్చరించారు. కేసు వ్యవహారం ఉద్రిక్తంగా మారడంతో విచారణను వేగవంతం చేసిన సుప్రీం కోర్టు సోమవారం తీర్పుచెప్పింది. ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం చేసుకోరాదంటూ న్యాయమూర్తులు పీఎస్ సవుఖాన్, ఎస్ఏ పాప్టేలు స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన వెంకటేశదీక్షిత్ తదితరులు బాణాసంచా కాల్చి భక్తులకు మిఠారుులు పంచిపెట్టారు. ప్రభుత్వం గట్టిగా తనవాదనను వినిపించనందునే కేసు ఓడిపోయామని ఆరుముగ స్వామితోపాటు తమిళ భాషాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.