
న్యూఢిల్లీ: ‘ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ్’స్థాపకుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కేంద్రాల్లో మూడింటిపై శనివారం దాడులు చేసిన పోలీసులు 47 మంది మహిళలు, ఆరుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ్ అనే ఆశ్రయంలో వందల సంఖ్యలో మహిళలు, బాలికలను బంధించి వారిపై లైంగిక దాడులు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి కేంద్రాలు మరో 8 ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు దృష్టికి రావడంతో వాటిలో కూడా సోదాలు జరపాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అందులో భాగంగానే పోలీసులు శనివారం ఆయా కేంద్రాలపై దాడులు చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లోనివారు పోలీసులను లోపలకు రానివ్వకపోవడంతో పక్కనున్న భవంతులపైకి ఎక్కి వారు లోపలకు ప్రవేశించారు. గురువారం రోహిణిలోని కేంద్రంపై జరిగిన దాడుల్లోనూ 41 మంది అమ్మాయిలను రక్షించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment