
నాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం విజయోత్సవ సభ బుధవారం సాయంత్రం కరీంనగర్ ఎస్సారార్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు. మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు బలగంతో, పెద్దపెల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల దసరాతో కరీంనగర్ సత్తా చాటారన్నారు.
తెలంగాణ సాధించడం వల్లే మట్టిలోని మాణిక్యాలు బయటకొస్తున్నాయని పేర్కొన్నారు. కాసర్ల శ్యామ్ గొప్ప పాటలు రాస్తూ తెలంగాణ సంస్కృతిని వెలుగులోకి తెస్తున్నారని.. నాని ఎక్కడ పుట్టినా దసరా సినిమా తర్వాత తెలంగాణ బిడ్డయ్యాడని అన్నారు.
నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. కరీంనగర్ ఎనర్జీ అద్భుతంగా ఉందని, ఈవెంట్ సక్సెస్‌కు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌లో అద్భుతమైన అభివృద్ధితోపాటు ప్రకృతి రమణీయత ఆకట్టుకుందని.. త్వరలోనే ఇక్కడ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తానన్నారు. దసరా డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. సక్సెస్ మీట్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, ఎడిటర్ నవీన్, ప్రముఖ నటుడు దీక్షిత్, దాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment