‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్ తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమైంది. తెలుగుతో పాటు దక్షిణాన అగ్ర నటిగా పేరు తెచ్చుకున్న కీర్తి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటోంది. ఆమె నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా మార్చి 30న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబై వెళ్లిన కీర్తి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీ సినిమాలో నటిస్తారా? అని అడగ్గా.. తప్పకుండ చేస్తానంది.
చదవండి: పొలిటీషియన్‌తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్
బాలీవుడ్ మీ అభిమాన హీరో ఎవరని ప్రశ్నించగా.. షారుక్ ఖాన్‌కు తను పెద్ద ఫ్యాన్‌ని అని సమాధానం ఇచ్చింది. అనంతరం ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎప్పటికీ వదులుకోనని, షారుక్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కాగా ‘మహానటి’తో కీర్తి నేషనల్ అవార్డును అందుకుంది. అంతేకాదు ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆమె అదే జోరును కొనసాగించలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఆమె చేసిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత సర్కారు వారి పాటతో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దసరా మూవీ విజయంపై ఆశలు పెట్టుకుంది.
చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment