-సమ్మె నోటిసు నేపథ్యంలో ఎస్మా ప్రయోగం
హైదరాబాద్
అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) నిబంధనల కింద తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లో అన్ని రకాల సమ్మెలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండిపోయిన 34 డిమాండ్లను పరిష్కరించకపోతే జూన్ 15వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు నిరవదిక సమ్మెలోకి దిగుతారని హెచ్చరిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల సమాఖ్య రెండు రోజుల కింద విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటిసులు అందజేశాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం జెన్‌కోలో సమ్మెలపై నిసేధం విధిస్తే ఉత్తర్వులు జారీ చేసింది.
జెన్‌కోలో సమ్మెలపై నిషేధం
Published Sat, May 21 2016 8:24 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement