ఎనిమిది గంటలపాటు కొనసాగిన అర్వింద్‌కుమార్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా – ఈ కారు రేసు కేసు దర్యాప్తులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బ్రిటన్ కంపెనీకి హెచ్‌ఎండీఏ నుంచి నిధు ల మళ్లింపుపైనే ప్రధానంగా అర్వింద్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి విచారణ సందర్భంగా సేకరించిన అంశాల ఆధారంగా అర్వింద్‌కుమార్‌ను ఈడీ అధికారు లు ప్రశ్నించారు.
ఈడీ సమన్ల మేరకు గురువారం ఉదయం 11.15 గంటలకు ఆయన బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. అప్పటి నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏకి చెందిన రూ.54.89 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్‌కు చెందిన ఫార్ములా –ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ) సంస్థకు ఎందుకు బదలాయించాల్సి వచ్చింది? హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల ఖర్చు విషయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? ఫార్ములా–ఈ కారు రేసు సీజన్ 9,10 నిర్వహణ కోసం చేసుకున్న ఒప్పందాలు.. తదితర అంశాలపై విచారణ జరిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. విధి నిర్వహణలో భాగంగానే తాను అంతా చేసినట్టు అర్వింద్‌కుమార్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. అవసరం అయితే మరోమారు విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు అర్వింద్‌కుమార్‌కు సూచించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment