Published
Wed, Aug 10 2016 11:19 PM
| Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
యాష్‌పాండ్‌కు మరో రెండు ఔట్‌లెట్లు
సీఆర్‌డీఏకు జెన్‌కో బూడిద
ముత్తుకూరు : నేలటూరులోని ఏపీజెన్‌కో ప్రాజెక్టు యాష్‌పాండ్(బూడిద బావి)కి మరో రెండు ఔట్‌లెట్లు మంజూరైనట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు బుధవారం తెలిపారు. ప్రస్తుతం రెండు ఔట్‌లెట్ల ద్వారా ద్రవ రూపంలో చేరే బూడిదతో యాష్‌పాండ్ ఓ వైపు పూర్తిగా నిండిపోయింది. దీంతో చెరువు మధ్య వరకు పైపును పొడిగించి బూడిద విడుదల చేయాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రూ.2.75 కోట్లతో మరో రెండు ఔట్‌లెట్లు, పైపులైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. నూతన రాజధానిలో నిర్మించనున్న రోడ్లకు జెన్‌కో ప్రాజెక్టు బూడిద తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు.