outlets
-
World Coffee Portal: కాఫీకి చైనా జై
తేనీరు... ప్రపంచంలో ఈ పానీయం గురించి తెలియనివారు ఉండరు. తేనీరు డ్రాగన్ దేశం చైనాలో పుట్టిందన్న వాదన కూడా ఉంది. ఈ ఉష్ణోదకం సేవించడంలో చైనీయులు ముందంజలో ఉంటారు. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. చైనా ప్రజలు ఇప్పుడు కాఫీపై మక్కువ పెంచుకుంటున్నారు. సాక్షాత్తూ ‘వరల్డ్ కాఫీ పోర్టల్’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. బ్రాండెడ్ కాఫీ షాప్ మార్కెట్ విషయంలో అమెరికాను చైనా మించిపోయిందని ‘వరల్డ్ కాఫీ పోర్టల్’ వెల్లడించింది. అమెరికాలో కంటే చైనాలోనే అత్యధిక కాఫీ ఔట్లెట్లు ఉన్నాయని తెలియజేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనాలో కాఫీ ప్రేమికుల పెరిగిపోతోందని, కేవలం గత 12 నెలల వ్యవధిలోనే కాఫీ ఔట్లెట్ల సంఖ్య 58 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రసుతం చైనాలో 49,691 బ్రాండెడ్ కాఫీ దుకాణాలు ఉన్నాయని వివరించింది. ► ప్రఖ్యాత స్టార్‌బక్స్ సంస్థ గత ఏడాది వ్యవధిలో చైనాలో కొత్తగా 785 కాఫీ దుకాణాలు తెరిచింది. చైనాలో రూ.1,660 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. అమెరికా బయట స్టార్‌బక్స్ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమకు రెండో అతిపెద్ద మార్కెట్ చైనాయేనని స్టార్‌బక్స్ స్పష్టం చేసింది. ► చైనాలో కాఫీలను విక్రయించడంలో స్టార్టప్ కంపెనీ ‘లకిన్ కాఫీ’దే పైచేయి. ఈ సంస్థకు దేశంలో 13,000కుపైగా ఔట్లెట్లు ఉన్నాయి. ► సర్వేలో భాగంగా 4,000 మంది కాఫీ ప్రియులను ప్రశ్నించారు. వీరిలో 90 శాతం మంది వారానికోసారి హాట్ కాఫీ తాగుతామని చెప్పారు. వారానికి ఒక్కసారైనా ఐస్డ్ కాఫీ తీసుకుంటామని 64 శాతం మంది తెలిపారు. ► ప్రతివారం కాఫీ షాప్‌నకు వెళ్తాం లేదా ఆర్డర్ చేసి తెప్పించుకుంటామని 90 శాతం మంది వెల్లడించారు. ► చైనాలో ఇటీవలికాలంలో ఆర్థిక ప్రగతి కొంత నెమ్మదించింది. అయినప్పటికీ ప్రపంచ కాఫీ పరిశ్రమగా చైనా ఎదుగుతుండడం విశేషం. ► చైనాలో తమ కంపెనీ ప్రస్థానం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని స్టార్‌బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ చెప్పారు. 2025 నాటికి చైనాలో 9,000 కాఫీ దుకాణాలు ప్రారంభించాలని స్టార్‌బక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫిష్.. ఫిష్ హుర్రే!
సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్‌లెట్స్‌కు ఆదరణ మరింత పెరుగుతోంది. ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్‌లెట్స్‌కు ఏ రోజు వెళ్లినా కావాల్సిన మత్స్య ఉత్పత్తులు తాజాగా దొరుకుతాయన్న నమ్మకం మాంసాహార ప్రియుల్లో ఏర్పడింది. దీంతో వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. తమకు జీవనోపాధి లభించడంతోపాటు తమ ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించగలుగుతున్నామని అవుట్‌లెట్స్ నిర్వాహకులు చెబుతుంటే.. శుభ్రమైన వాతావరణంలో తాజా మత్స్య ఉత్పత్తులు లభిస్తున్నాయని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వినియోగం పెంచే లక్ష్యంతో.. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట ప్రభుత్వం బ్రాండింగ్ చేసి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేల అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో జిల్లాకు ఒకటి చొప్పున ఆక్వా హబ్, వాటికి అనుబంధంగా 4 వేల అవుట్‌లెట్స్, స్పోక్స్, డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్స్‌తో పాటు త్రీవీలర్, 4 వీలర్ కియోస్‌్కలను 60 శాతం సబ్సిడీపై నిరుద్యోగ యువతకు మంజూరు చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,250 అవుట్‌లెట్స్, 70 త్రీ వీలర్, 84 ఫోర్ వీలర్ వెహికల్స్, 62 డెయిలీ, 50 సూపర్, 11 లాంజ్ యూనిట్స్ కలిపి మొత్తంగా 1,527 యూనిట్స్ ఏర్పాటయ్యాయి. తొలుత నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగా దొరికే చేపలు, రొయ్యలతోపాటు సముద్ర మత్స్య ఉత్పత్తులు సైతం లభిస్తుండటంతో వీటిని కొనేందుకు ఎగబడుతున్నారు. స్పందన చాలా బాగుంది ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేసేవాడిని. నెలకు రూ.15 వేలు జీతం వచ్చేది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్ట్ సెంటర్లో 60 శాతం సబ్సిడీతో ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ పెట్టుకున్నా. ఆదివారం 200–300 కిలోలు, మిగిలిన రోజుల్లో 50నుంచి 100 కేజీల వరకు మత్స్య ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. నాకు ఉపాధి లభించడంతోపాటు మరో నలుగురికి ఉపాధి చూపిస్తున్నా. కాకినాడ నుంచి సముద్ర చేపలు, రొయ్యలు, పీతలు సైతం వస్తున్నాయి. సీ ఫుడ్స్ కోసం క్యూ కడుతున్నారు. సాయంత్రం పూట చేప, రొయ్య తదితర వంటకాలతో వాల్యూ యాడెడ్ యూనిట్ నడుపుతున్న. స్పందన చాలా బాగుంది. సిబ్బంది జీతభత్యాల కింద రూ.56 వేలు చెల్లిస్తున్నా. రూ.60 వేలకు పైగా ఈఎంఐలు కడుతున్నా. అయినా రూ.50 వేల వరకు మిగులుతోంది. – బట్టు రాజశేఖర్, ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ నిర్వాహకుడు, కర్నూలు చాలా తాజాగా ఉంటున్నాయి ప్రతి ఆదివారం ఫిష్ ఆంధ్ర అవుట్లెట్కు వస్తున్నా. ఇక్కడ గోదావరిలో మాత్రమే దొరికే చేపలతో పాటు సముద్ర చేపలు, రొయ్యలు కూడా దొరుకుతాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి. – జి.శ్రీనివాసరావు, పోరంకి, విజయవాడ హైజీనిక్‌గా ఉంటున్నాయి అవుట్లెట్కు ఏరోజు వచ్చినా అన్నిరకాల చేపలు దొరుకుతున్నాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. – కె.రామయ్య, ఈడుపుగల్లు, పెనమలూరు ఆదరణ పెరుగుతోంది స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే మూడు హబ్‌లతో పాటు 1,500కు పైగా అవుట్‌లెట్స్, ఇతర యూనిట్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గతంతో పోలిస్తే స్థానిక వినియోగం గణనీయంగా పెరిగింది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
100 మంది మహిళలతో మిల్లెట్ ఔట్లెట్లు
సాక్షి, హైదరాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వారిని వ్యాపారవేత్తలుగా మలిచేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని టీఎస్ ఆగ్రోస్ చర్య లు చేపట్టింది. మార్కెట్లో డిమాండ్గల చిరుధాన్యా ల ఉత్పత్తుల వ్యాపారంలో మహిళలను భాగస్వాములను చేయాలని, స్టార్టప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారితో రాష్ట్రవ్యాప్తంగా చిరుధాన్యాలు, వాటి ఉత్పత్తులను విక్ర యించేందుకు ఔట్లెట్స్ ఏర్పాటు చేయించనుంది. ఈ దిశగా కసరత్తులో భాగంగా గురువారం హైద రాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి వంద మందికిపైగా ఔత్సాహిక మహిళలు హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రా వు, ప్రత్యేక కమిషనర్ హనుమంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, అక్షయపాత్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. తొలి దశలో... మిల్లెట్ ఔట్లెట్లను తొలిదశలో జిల్లా కేంద్రాల్లో ఒకట్రెండు చొప్పున, జీహెచ్ఎంసీ పరిధిలో పది ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని టీఎస్ ఆగ్రోస్, అక్షయపాత్ర నిర్ణయించాయి. త్వరలోనే ఔత్సాహిక మహిళల్ని ఎంపిక చేసి వారికి ఔట్లెట్లు కేటాయించేలా కసరత్తు జరుగుతోంది. మిల్లెట్ ఔట్లెట్లలో అక్షయపాత్ర కీలకపాత్ర పోషించనుంది. వ్యాపారానికి అవసరమైన చిరుధాన్యాలను, వాటి ఉత్పత్తులను ఈ సంస్థనే సరఫరా చేయనుంది. దీంతోపాటు ప్రత్యేకంగా షాప్ అద్దెకు తీసుకోలేని వారి కోసం ప్రత్యేకంగా కంటెయినర్ షాప్‌లను కూడా అక్షయపాత్ర రూపొందించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీఎస్ ఆగ్రోస్, అక్షయపాత్ర మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. చిన్నారులు మొదలుకొని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధుల వరకు అవసరమైన చిరుధాన్యాల ఆహారాలను ఈ సంస్థ అందించనుంది. మొత్తం 68 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా చిన్నపిల్లల కోసం చిరుధాన్యాలతో నూడుల్స్, బిస్కెట్స్ వంటి వాటిని కూడా తయారు చేస్తోంది. ఔత్సాహిక మహిళలు పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేకుండానే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా టీఎస్ ఆగ్రోస్ రుణాలు ఇప్పించనుంది. సదస్సులో పాల్గొన్న బ్యాంక్ ప్రతినిధులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికీ వ్యాపార విస్తరణ, పెట్టుబడిని బట్టి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు అందించేందుకు బ్యాంకు ముందుకొచ్చింది. ఈ కార్యక్రమం అనంతరం ఔత్సాహిక మహిళలకు ఏర్పాటు చేసిన భోజనంలో మిల్లెట్ పులిహోర, మిల్లెట్ సాంబార్ ఫుడ్, మిల్లెట్ కర్డ్ ఫుడ్, మిల్లెట్ రోటీ, మిల్లెట్ ఐస్‌క్రీం వంటి వాటిని అందించారు. -
నెక్సా కస్టమర్లు 20 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెక్సా రిటైల్ చైన్ల ద్వారా ఇప్పటి వరకు 20 లక్షల కార్లు రోడ్డెక్కాయని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. ప్రీమియం కార్ల విక్రయాల కోసం 2015లో నెక్సా కేంద్రాలను కంపెనీ ప్రారంభించింది. బలేనో, ఇగ్నిస్, సియాజ్, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా మోడళ్లు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న ఎస్‌యూవీలు ఫ్రాంక్స్, జిమ్నీ సైతం వీటి సరసన చేరనున్నాయి. ఇతర మోడళ్లను అరీనా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. హ్యుండై, టాటా మోటార్స్ విక్రయాల కంటే నెక్సా కేంద్రాల ద్వారా వచ్చే ఏడాది అధిక యూనిట్లను నమోదు చేయాలన్నది లక్ష్యమని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. రెండవ స్థానం దిశగా.. తొలి 10 లక్షల యూనిట్లకు నాలుగేళ్లు, ఆ తర్వాతి 10 లక్షల యూనిట్లకు మూడేళ్ల సమయం పట్టిందని శశాంక్ వెల్లడించారు. ‘ప్రస్తుతం మారుతీ సుజుకీ అరీనా, హ్యుండై, టాటా మోటార్స్ తర్వాత నెక్సా నాల్గవ స్థానంలో ఉంది. వచ్చే ఏడాది రెండవ స్థానానికి చేరుతుంది. సంస్థ మొత్తం విక్రయాల్లో 47 శాతం వృద్ధితో నెక్సా వాటా 23 శాతం ఉంది. దేశీయ ప్యాసింజర్ కార్ల రంగంలో నెక్సా 10 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ ఔట్లెట్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 2.55 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022–23లో 3.7 లక్షల యూనిట్లు ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త మోడళ్లు, గ్రాండ్ వితారా కారణంగా నెక్సా నుంచి 6 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాం’ అని వివరించారు. పరిశ్రమ కంటే మెరుగ్గా.. 2023–24లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 5–7.5 శాతం ఆశిస్తున్నామని శశాంక్ తెలిపారు. ‘పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు, 2023–24లో 41 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. ఆర్థిక వృద్ధి, రుతుపవనాల సరళి, గ్రామీణ మార్కెట్‌పై దాని ప్రభావం, వడ్డీ రేట్ల పెరుగుదల, నగదు లభ్యత స్థాయిలు, పరిస్థితులకు తగ్గట్టుగా వాహన తయారీ కంపెనీలు చేపట్టిన ధరల పెంపు వంటి అంశాల ఆధారంగా ఈ వృద్ధి ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ కంటే మెరుగైన వృద్ధిని మారుతీ సుజుకీ ఆశిస్తోంది’ అని పేర్కొన్నారు. -
ఫ్యూచర్ స్టోర్స్ రీబ్రాండింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భవన యజమానులకు బకాయిలు చెల్లించలేక మూతపడ్డ ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోవడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తొలి దశలో 250 కేంద్రాలను రిలయన్స్ చేజిక్కించుకుంటోంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20 వరకు ఔట్లెట్స్ ఉన్నట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్ నిర్వహణలో దేశవ్యాప్తంగా 1,700లకుపైగా కేంద్రాలు ఉన్నాయి. ఫ్యూచర్ రిటైల్ ఆస్తుల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెజాన్ మధ్య లీగల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాస్తా బకాయిలు పేరుకుపోవడానికి దారి తీయడం, అద్దెలు చెల్లించలేకపోవడంతో ఫ్యూచర్ రిటైల్ ఔట్లెట్స్ కాస్తా మూసివేతకు గురవుతున్నాయి. కాగా, రీబ్రాండింగ్‌తో ఎఫ్‌బీబీ స్టోర్లు ట్రెండ్స్ కేంద్రాలుగా మారనున్నాయి. బిగ్ బజార్ స్టోర్స్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లేదా రిలయన్స్ మార్కెట్, ఈజీ డే ఔట్లెట్స్ రిలయన్స్ ఫ్రెష్‌గా పేరు మారనున్నాయి. ఫ్యూచర్ రిటైల్ నెట్‌వర్క్‌లో పని చేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని రిలయన్స్ నిర్ణయించింది. ఈ నిర్ణయం సుమారు 30,000 మందికి ఊరట కలిగించనుంది. ‘నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. విక్రేతలు, సరఫరాదార్లు తమ బకాయిలు పొందుతున్నారు. భవన యజమానులు సైతం తమ స్టోర్స్‌ను రిలయన్స్‌కు లీజుకు ఇస్తున్నారు. గత ఏడాది అద్దెలు ఫ్యూచర్ గ్రూప్ నుంచి వీరికి అందలేదు. ఆ బకాయిలను సంస్థ తీర్చింది. అయితే నష్టాలు వస్తున్న ఔట్‌లెట్స్‌ను కంపెనీ తీసుకోవడంతో దివాలా ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్దుబాటు పథకం గనుక ఆమోదం పొందితే తమ బకాయిలు రాగలవని రుణదాతలు భావిస్తున్నారు’ అని రిలయన్స్ వెల్లడించింది. -
ఏపీలో ఎంజీ మోటార్.. మరో రెండు ఔట్లెట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నెల్లూరు, తిరుపతిలో షోరూంలను ప్రారంభించింది. ఇప్పటికే ఏపీలో సంస్థకు 10 టచ్‌పాయింట్స్ ఉన్నాయి. మరో ఆరు కేంద్రాలు డిసెంబర్‌కల్లా ఏర్పాటు కానున్నాయి. దేశవ్యాప్తంగా ఎంజీ మోటార్ ఇండియాకు 307 ఔట్లెట్స్ ఉన్నాయి. -
మన చేప మన ఆరోగ్యం
-
త్వరలో మొబైల్ ఫిష్ ఔట్లెట్లు: తలసాని
సాక్షి, హైదరాబాద్: చేపల విక్రయాల కోసం రాష్ట్రంలో త్వరలోనే మొబైల్ ఫిష్ ఔట్లెట్లు ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.18 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేస్తామని, ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఈ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి మత్స్య సహకార సంఘాల అభివృద్ధి, సభ్య త్వ నమో దు తదితర అంశాలపై మత్స్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పందుల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తలసాని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేయదగిన సాయాన్ని అధ్యయనం చేసేందుకు పందుల పెంపకం దారులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. -
డుమాంట్.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి కొత్త బ్రాండ్ ‘డుమాంట్’ ప్రవేశించింది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో 10 స్టోర్లను తెరిచిన ఈ కంపెనీ.. ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో 100 ఔట్లెట్లను ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉంది. మూడేళ్లలో ఈ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోనూ అడుగుపెడతామని డుమాంట్ ఎండీ వివేక్ అయినంపూడి తెలిపారు. గురువారమిక్కడ డుమాంట్ బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా బ్రాండ్ డైరెక్టర్ సుమన్ గద్దె, మార్కెటింగ్ డైరెక్టర్ చైతన్య బోయపాటితో కలిసి మీడియాతో మాట్లాడారు. 2022 నాటికి 300 కేంద్రాల స్థాయికి వెళతామన్నారు. సొంత స్టోర్లతోపాటు ఫ్రాంచైజీల ద్వారా కూడా నెలకొల్పుతామని చెప్పారు. ఫ్రాంచైజీ కోసం ఇప్పటికే 40కి పైగా ఎంక్వైరీలు వచ్చాయన్నారు. తొలి ఏడాది రూ.12–15 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్టు వెల్లడించారు. డుమాంట్ ఉత్పత్తుల అభివృద్ధికి రూ.3 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. భారత్‌లో తొలిసారిగా.. విజయవాడ కేంద్రంగా 20 ఏళ్లుగా ఐస్‌క్రీమ్స్ విపణిలో ఈ కంపెనీ విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దక్షిణాదిన వివిధ బ్రాండ్లలో ఫ్రోజెన్ డెసర్ట్ను పలు రెస్టారెంట్లు, క్యాటెరర్స్కు సరఫరా చేస్తోంది. గంటకు 1,900 లీటర్ల ఐస్ క్రీమ్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. విజయవాడ కేంద్రానికి ఇప్పటికే రూ.15 కోట్లు వెచ్చించింది. 10 కోల్డ్ స్టోరేజీలను నిర్వహిస్తోంది. ఒకట్రెండేళ్లలో హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటు చేస్తామని వివేక్ తెలిపారు. గంటకు 3,000 లీటర్ల ఐస్‌క్రీమ్ ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటుకు రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తామన్నారు. ‘డుమాంట్ బ్రాండ్‌లో 34 రకాల ఐస్ క్రీమ్స్, మిల్స్షేక్స్ను తీసుకొచ్చాం. అన్నీ స్వచ్చమైన పాలతో చేసినవే. భారత్‌తోపాటు పలు దేశాల నుంచి తాజా పండ్లను సేకరించి వీటి తయారీలో వాడుతున్నాం. బ్లూబెర్రీ చీస్‌కేక్, కారామెలైజ్డ్ పైనాపిల్, చాకో ఆరేంజ్, మాపుల్ అండ్ రైసిన్స్, ఖీర్, థాయ్ టీ వంటి వెరైటీలు భారత్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టినవే. కొత్త రుచుల అభివృద్ధిలో ప్రత్యేక విభాగం నిమగ్నమైంది’ అని వివరించారు. -
ఏటా 100 ‘బిగ్ సి’ ఔట్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ ఏటా 100 ఔట్లెట్లను తెరవనుంది. ప్రస్తుతం కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 225 స్టోర్లు ఉన్నాయి. సెప్టెంబరులో తమిళనాడులో ఎంట్రీ ఇస్తున్నట్టు సంస్థ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. గురువారమిక్కడ బిగ్ సి కొత్త లోగో ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కంపెనీ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత అక్కినేని వ్యవహరిస్తారని ప్రకటించారు. ‘2019 మార్చినాటికి 300 కేంద్రాల స్థాయికి చేరతాం. మూడేళ్లలో దక్షిణాదిన పూర్తి స్థాయిలో విస్తరించి, టాప్ రిటైలర్‌గా నిలవాలన్నది లక్ష్యం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అడుగుపెడతాం. 2017–18లో రూ.1,015 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు ఆశిస్తున్నాం. ప్రస్తుతం 2,500 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు’ అని వివరించారు. -
టీ అమ్ముతూ నెలకు 12 లక్షలు
పుణె: చాయ్ అమ్ముతూ నెలకు ఎంత సంపాదించొచ్చు? వ్యాపారం బాగా జరిగినా రోజుకు వెయ్యి రూపాయలు ఆదాయం పొందడం గగనం. అలాంటిది పుణెలో ఓ వ్యక్తి మాత్రం చాయ్ అమ్మి ఏకంగా నెలకు రూ. 12 లక్షలు ఆర్జిస్తున్నాడు. అతనే నవ్‌నాథ్ యేవలే. పుణెలో టీకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రఖ్యాత టీ బ్రాండ్లు, ఔట్లెట్లు ఏవీ లేవని 2011లో యేవలే గుర్తించారు. ఆ తర్వాత తాను ఆ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని తన టీ రుచి ఎలా ఉండాలనే దానిపై నాలుగేళ్లు పరిశోధనలు చేశారు. అనంతరం మరికొందరిని భాగస్వాములుగా చేర్చుకుని తన పేరుమీదనే చాయ్ దుకాణం తెరిచారు. కొద్దిరోజుల్లోనే ఆయన టీకి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పుణెలోనే మరో రెండు చోట్ల యేవలే ఔట్లెట్లను తెరిచారు. ఇప్పుడు ఒక్కో ఔట్లెట్లో 12 మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. రోజుకు దాదాపు 4 వేల కప్పుల చాయ్ అమ్ముడుపోతోంది. త్వరలోనే యేవలే టీ స్టాల్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాననీ, మరో వంద టీ స్టాల్స్ ఏర్పాటు చేసి మరింత మందికి ఉద్యోగాలిస్తానని ఆయన చెబుతున్నారు. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించడంతో దానిపై తీవ్ర చర్చ జరగడం తెలిసిందే. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘పకోడా వ్యాపారంలా కాకుండా మేం చాయ్ అమ్మి ఉపాధి కూడా కల్పిస్తున్నాం’ అని నవ్‌నాథ్ అన్నారు. -
మరింత చేరువలో సేవలు
శ్రీకాకుళం: జిల్లాలో 5వేల జనాభా దాటిన గ్రామాల్లో బ్యాంకింగ్ అవుట్లెట్లు ఏర్పాటు చేసేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. 5 వేల జనాభా దాటిన గ్రామంలో బ్యాంకు బ్రాంచిని ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంకు అన్ని యాజమాన్యాలకు 2014లో దిశానిర్దేశం చేసింది. జిల్లాలో అప్పట్లో 15 గ్రామాలను బ్యాంకు ఏర్పాటుకు ఎంపిక చేశారు. స్థాయిని బట్టి ఆయా గ్రామాల్లో బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు కేటాయింపులు జరిపారు. బ్యాంకు శాఖలను ప్రారంభించే ముందు ఆయా యాజమాన్యాలు సర్వే చేయించాయి. గ్రామస్థాయిలో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులతో శాఖలను ప్రారంభించినా.. అందుకు తగ్గ లావాదేవీలు జరగవని గుర్తించాయి. ఇదే విషయాన్ని ఆర్బీఐకు నివేదించాయి. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి వారికిచ్చే వడ్డీకి మరో రెండుమూడు శాతం ఎక్కువగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు రుణాన్ని ఇవ్వడం బ్యాంకుల విధి కాగా లావాదేవీలు జరగనప్పుడు రుణాలు ఇవ్వడం కూడా సాధ్యపడదని ఆర్బీఐ దృష్టికి పలు బ్యాంకులు తీసుకెళ్లాయి. బ్యాంకు శాఖ బదులుగా బ్యాంకింగ్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తామని బ్యాంకులు ఆర్బీఐకు స్పష్టం చేశాయి. ఎలా నిర్వహిస్తారంటే.. ఓ బ్యాంకు ప్రతినిధిని గ్రామంలో నియమస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక ప్రదేశంలో ఉండి.. లావాదేవీలు నిర్వహిస్తారు. ఖాతాదారుడు ఈ ప్రతినిధి ద్వారా రూ.10వేల వరకు లావాదేవీలు జరుపుకొనే వీలు కల్పిస్తామని ఆర్బీఐకి వివరించారు. దీనికి ఆర్బీఐ సమ్మతించించింది. ఎప్పటిలోగా వీటిని ఏర్పాటు చేస్తారో తెలియజేయాలని బ్యాంకు యాజమాన్యాలను కోరింది. మార్చి 31వ తేదీలోగా వీటిని ఏర్పాటుచేస్తామని తెలిపాయి. దీనికి ఆర్బీఐ సమ్మతించడంతో అవుట్లెట్లు ఏర్పాటు చేసే పనిలో బ్యాంకు యాజమాన్యాలు ఉన్నాయి. ప్రస్తుతం స్థలాలను గుర్తించే పనిలో పడ్డాయి. తొలి అవుట్లెట్ రాజాపురంలో కవిటి మండలం రాజాపురం ఆంధ్రాబ్యాంకు శాఖ ఈ నెల 31వ తేదీలోగా బ్యాంకు పరిధిలోని భైరి గ్రామంలో బ్యాంకింగ్ అవుట్లెట్లను తొలిసారిగా ప్రారంభించనుంది. మార్చి 31వ తేదీ లోగా మిగిలిన అన్ని బ్యాంకులు కూడా ఎంపిక చేసిన 15 గ్రామాల్లో అవుట్ లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది పూర్తయితే గ్రామ స్థాయిలోనే బ్యాంకింగ్ అందుబాటులోకి రానున్నాయి. మార్చి 31లోగా అవుట్ లెట్ల ఏర్పాటు జిల్లాలో ఎంపిక చేసిన 15 గ్రామాల్లో మార్చి 31లోగా బ్యాంకింగ్ అవుట్ లెట్లను ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 30 బ్యాంకులకు సంబంధించి 300 శాఖలు లావాదేవీలు జరుపుతున్నాయి. అవుట్లెట్లు వినియోగంలోకి వస్తే 315 అవుతాయి. వ్యాపారం బాగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని బ్యాంకు శాఖలను యాజమాన్యాలు ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించడమే ధ్యేయంగా బ్యాంకులు పనిచేస్తున్నాయి. – పొట్లూరి వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ -
షాపింగ్.. ఇప్పుడు వినోదం
• స్పార్ ఎండీ రాజీవ్ కృష్ణన్ కుటుంబసమేతంగా వస్తున్నారు... • స్టోర్లలో అందుకు తగ్గ ఏర్పాట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : షాపింగ్ అంటే అవసరమున్న వస్తువులు.. అదీ సమయం దొరికినప్పుడు సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి కొనుక్కోవడం. ఇదంతా గతం. ఇప్పుడు వినియోగదార్ల ధోరణి మారింది. శని, ఆదివారాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూడ్డం. కుటుంబ సభ్యులతో కలిసి సూపర్/హైపర్ మార్కెట్‌కు వెళ్లడం. మొత్తంగా షాపింగ్ అంటే కుటుంబ వినోదంగా మారిందని అంటున్నారు స్పార్ హైపర్‌మార్కెట్స్ ఇండియా ఎండీ రాజీవ్ కృష్ణన్. స్పార్ కస్టమర్లకు షాపింగ్ అనుభూతి కల్పించేందుకు కొత్త విధానాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. అందుకే ఔట్లెట్లు కళకళలాడుతున్నాయని అన్నారు. హైదరాబాద్ నాచారంలో స్పార్ 4వ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే.. ఆనందంగా గడపాలి.. టాప్ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించి కస్టమర్లను భాగస్వాములను చేస్తున్నాం. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లుంటాయి. భార్యలు షాపింగ్ చేస్తుంటే భర్తలకు వినోదం కల్పించేందుకు జనరల్ నాలెడ్జ్ పోటీలు నిర్వహించడం, ఇతర కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలని అనుకుంటున్నాం. ఔట్లెట్ నుంచి కస్టమర్లు ఆనందంగా వెళ్లాలన్నది మా అభిమతం. స్టోర్‌లో షాపింగ్ కోసం ఒక్కో కుటుంబం కనీసం గంటన్నర సమయం వెచ్చిస్తున్నారు. ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రతి రోజూ కొత్త ఉత్పత్తులు వస్తూనే ఉన్నాయి. నగరాలు, ప్రాంతాలనుబట్టి కస్టమర్ల షాపింగ్ తీరు మారుతుంది. అందుకే వేటిని ఎక్కువగా వినియోగదార్లు ఆదరిస్తున్నారో బిగ్ డేటా ఆధారంగా పరిశీలిస్తాం. అటువంటి వాటినే అందుబాటులో ఉంచుతాం. స్టోర్‌లో డిస్ప్లే ఆకట్టుకునేలా ఉండేందుకు ప్రత్యేక సిబ్బంది నిరంతరం నిమగ్నమవుతారు. భాగస్వాములూ ముఖ్యమే.. వేలాది మంది రైతులు, ఉత్పత్తుల తయారీదారులతో చేతులు కలిపాం. పండుగలకు ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇస్తున్నాం. నాణ్యత పెరిగేందుకు వారి నుంచే సలహాలు స్వీకరిస్తున్నాం. మా విధానం మార్పుకోవడానికి ఇది దోహదం చేస్తోంది. భాగస్వాములతో బంధం గట్టిపడితేనే కంపెనీతోపాటూ వారూ వృద్ధి చెందుతారు. రిటైల్ రంగంలో కొన్ని మాకంటే పెద్ద కంపెనీలే కావొచ్చు. కానీ భాగస్వాములు, కస్టమర్లను అర్థం చేసుకోవడం ద్వారా వృద్ధి బాటలో పయనిస్తున్నాం. చిన్న వ్యాపారులకూ వేదిక.. పెద్ద కంపెనీలే కాదు సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలూ వాటి సొంత బ్రాండ్లతో పోటీపడుతున్నాయి. ఇందుకు సూపర్/హైపర్ మార్కెట్లు వేదిక అవుతున్నాయి. నాణ్యమైన ఉత్పాదన తయారు చేస్తే చాలు మేం విక్రయిస్తాం. అందుకు తగ్గట్టుగా అమ్మకాల పరంగా ప్రోత్సహిస్తున్నాం. మా సిబ్బంది ఉత్పాదన విశిష్టతలను కస్టమర్లకు వివరిస్తారు. ఇతర రాష్ట్రాల్లో దొరికే ప్రముఖ ఉత్పత్తులను అన్ని స్టోర్లలో అందుబాటులో ఉంచుతున్నాం. ఇక ప్రైవేటు లేబుల్ విభాగంలోనూ తయారీ సంస్థలకు వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాం. మా అమ్మకాల్లో ప్రైవేట్ లేబుల్ వాటా 10-15% ఉంటుంది. క్యూ లైన్లకు చెల్లు.. కస్టమర్ల సౌకర్యార్థం బెంగళూరులో ఇటీవలే ఆన్లైన్ సౌకర్యాన్ని ప్రారంభించాం. డిసెంబరుకల్లా మిగిలిన 8 నగరాల్లోని స్టోర్లకూ ఆన్‌లైన్‌ను విస్తరిస్తాం. ఆలస్యం కాకుండా క్యూ లైన్లలో ఉన్న కస్టమర్ల వద్దకే సిబ్బంది వెళ్లి బిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. బెంగళూరులోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. మార్చికల్లా ఇతర ఔట్లెట్లలో పరిచయం చేస్తాం. కియోస్క్‌లను ఏర్పాటు చేసి వర్చువల్ రియాలిటీ విధానంలో కస్టమర్లకు చేరువ కానున్నాం. టెక్నాలజీ కోసం టాప్ కంపెనీలతో చేతులు కలిపాం. భారత రిటైల్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 18 ఔట్లెట్లను నిర్వహిస్తున్నాం. ఈ సంఖ్యను పెంచేందుకు పరుగెత్తం. ప్రణాళిక ప్రకారం దశలవారీగా ఇతర నగరాల్లో విస్తరిస్తాం. సామాన్లు మోసి.. సూపర్ మార్కెట్లో చిన్న ఉద్యోగిగా అమెరికాలో రాజీవ్ కృష్ణన్ కెరీర్ ప్రారంభించారు. విధుల్లో భాగంగా దుకాణంలో సరుకులనూ మోశారు. వాల్‌మార్ట్, టార్గెట్, మెకిన్సీ, భారతీ రిటైల్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేశారు. 21 ఏళ్లు యూఎస్‌లో, 9 ఏళ్లు భారత్‌లో పనిచేసిన అనుభవం ఉంది. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 2016 ఆగస్టులో ప్రస్తుత బాధ్యతలు స్వీకరించారు. -
యాష్‌పాండ్‌కు మరో రెండు ఔట్లెట్లు
సీఆర్డీఏకు జెన్కో బూడిద ముత్తుకూరు : నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్టు యాష్‌పాండ్(బూడిద బావి)కి మరో రెండు ఔట్లెట్లు మంజూరైనట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు బుధవారం తెలిపారు. ప్రస్తుతం రెండు ఔట్లెట్ల ద్వారా ద్రవ రూపంలో చేరే బూడిదతో యాష్‌పాండ్ ఓ వైపు పూర్తిగా నిండిపోయింది. దీంతో చెరువు మధ్య వరకు పైపును పొడిగించి బూడిద విడుదల చేయాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రూ.2.75 కోట్లతో మరో రెండు ఔట్లెట్లు, పైపులైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. నూతన రాజధానిలో నిర్మించనున్న రోడ్లకు జెన్కో ప్రాజెక్టు బూడిద తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. -
టీ సర్కారు కంపెనీ 'కాకతీయ ఫుడ్స్'
హైదరాబాద్: 'కాకతీయ ఫుడ్స్' బ్రాండ్‌తో తెలంగాణ ప్రభుత్వం పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను విక్రయించాలని నిర్ణయించింది. దేశ విదేశాలకు సేంద్రీయ పండ్లు, కూరగాయలు ఎగుమతి చేయాలని... అలాగే కల్తీ లేని కారం, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలను ఔట్లెట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ విధివిధానాలను ఖరారు చేస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఉద్యానాభివృద్ధి సంస్థ పేరుతో కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తులు పండిస్తే... రైతులకు లాభసాటిగా చేసేందుకు ఆ ఉత్పత్తులకు అవసరమైన ప్రాసెసింగ్, మార్కెటింగ్ బాధ్యత ఉద్యానాభివృద్ధి సంస్థ చేపడుతుంది. ఈ రెండూ సమన్వయంతో ముందుకు సాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆహార పదార్థాల్లో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుండటంతో ఏం తినాలన్నా భయపడాల్సి వస్తోందని.. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అందుకోసం ఆయన ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
150కి చేరిన మలబార్ గోల్డ్ షోరూమ్స్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త మైలురాయిని చేరుకుంది. ఇటీవల ఒమాన్, షార్జా, మెహదీపట్నం, బెలగావిల్లో కొత్తగా ప్రారంభించిన షోరూమ్‌లతో సంస్థ మొత్తం ఔట్లెట్స్ (9 దేశాల్లో) 150కి పెరిగాయని మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు పలు రకాల డిజైన్లతో కూడిన ఆభరణాలను అందుబాటులో ఉంచామని, వీటి కొనుగోలుపై వెండిని ఉచితంగా అందిస్తున్నామని పేర్కొంది. ‘అక్షయ తృతీయ వంటి పండుగల సందర్భంగా ఆభరణాల కొనుగోలుకు తమ షోరూమ్‌లకు వస్తోన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వినియోగదారులకు ఎప్పుడూ నాణ్యమైన సేవలను అందించడంలో ముందుంటాం’ అని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్ తెలిపారు. -
‘వింగ్స్టర్’.. తింటే మీరే స్టార్!
5 నిమిషాల్లో తింటే.. ప్రతి రోజూ వింగ్స్టర్ చాలెంజ్, ఫాస్టెస్ట్ ఈటర్ అనే రెండు రకాల పోటీలు పెడుతున్నాం. ఇవేంటంటే.. 5 నిమిషాల్లో లెవల్ 8లో 8 చికెన్ వింగ్స్‌ను తినాలి. అది కూడా 5 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా. కర్చీప్‌తో తుడుచుకోకుండా! అలా చేస్తే మీరు తిన్న డిష్‌కు బిల్లు చెల్లించనక్కర్లేదు. పైగా రెస్టారెంట్లో ఉన్న వింగ్స్టర్ వాల్ ఆఫ్ ఫ్రేంలోకి మీ ఫొటో చేరుతుంది. ఒకవేళ మీరు అందరి కంటే త్వరగా తినేయగలిగితే.. రూ.1,000 నగదు కూడా అందుకోవచ్చు. ఇప్పటివరకు ఈ వింగ్స్టర్ చాలెంజ్‌లో 400 మంది పాల్గొంటే.. గెలిచింది కేవలం 40 మంది. 5 నిమిషాల్లో.. 8 చికెన్ వింగ్స్‌ను తింటేనే సుమీ * యూఎస్ చికెన్ వింగ్స్‌ను హైదరాబాదీలకు పరిచయం చేస్తున్న వింగ్స్టర్ * నెలాఖరులో జేఎన్టీయూలో.. జూన్‌లో విజయవాడలో ఔట్లెట్లు * నాలుగు నెలల్లో 700-800 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ అంటేనే బిర్యానీ అడ్డా. కొత్తవారెవరైనా సరే నగరానికొస్తే బిర్యానీ రుచి చూడందే తిరిగెళ్లరు. అలాంటి భోజన ప్రియులను మరో కొత్త రకం వంటకం పిలుస్తోంది. ఇంకా చెప్పాలంటే... ప్రారంభమైన కొద్ది కాలంలోనే ఈ వంటకం లక్ష మంది కస్టమర్ల చేత ఆహో.. ఓహో అనిపించుకుంది. ఆ వంటకమే ‘చికెన్ వింగ్స్’! అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ వంటకాన్ని హైదరాబాదీలకూ పరిచయం చేశారు రాకేష్ నాదెండ్ల. అసలా వంటకమేంటి? దాని కథేంటి? రాకేష్ మాటల్లోనే... ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లా. చదువు, ఆపై ఉద్యోగ రీత్యా 8 ఏళ్ల పాటు అక్కడే ఉన్నా. అప్పుడు రోజూ అక్కడ బాగా ప్రాచుర్యం పొందిన చికెన్ వింగ్స్‌ను తినేవాణ్ణి. ఇండియాకు తిరిగొచ్చాక అవి ఇక్కడ దొరికేవి కాదు. ఇంట్లో వాళ్లను చేయమంటే ఎలా చేయలో వాళ్లకి తెలియదు. దాంతో వింగ్స్ వ్యాపారాన్ని ఆరంభించి, అందరికీ రుచి చూపించాలని నిర్ణయించుకున్నా. మొదట్లో ఫ్రాంచైజీ మోడల్‌ను తీసుకుందామని అమెరికాకు చెందిన రెస్టారెంట్ వాళ్లతో మాట్లాడితే... రూ.5 కోట్లు ఖర్చవుతుందన్నారు. పైగా సాస్‌లు, స్పైస్లను అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి. దీంతో సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. సింగపూర్, దుబాయ్ నుంచి షెఫ్‌లను తెచ్చుకున్నా. వాళ్లతో ఏడాది పాటు సాస్‌లు తయారు చేయించా. తయారైన వంటకాన్ని రోజూ నాతో పాటు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తినిపించా. అయితే నేను ఫ్యామిలీ మెంబర్‌ను కావటంతో వాళ్లు బాగుందనే చెప్పేవాళ్లు. అప్పుడే అని పించింది... ఈ చికెన్ వింగ్స్‌ను జనాల్లోకి తీసుకెళితే గానీ అసలైన రుచి బయటపడదని!!. అలా తొలిసారిగా రూ.25 లక్షల పెట్టుబడితో 2014 లో మాదాపూర్‌లో వింగ్స్టర్ రెస్టారెంట్‌ను ప్రారంభించాం. ప్రత్యేక వంటలు చాలా ఉన్నాయ్... వింగ్స్టర్, చికెన్ స్టఫ్డ్ ఆమ్లెట్, వింగ్స్టర్ రైస్ బౌల్‌తో పాటు ఉలవచారు సాస్, గోంగూర సాస్ వంటివి మేం ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. వీటితో పాటూ చైనీస్, అమెరికన్, ఇటాలియన్ మెనూ కూడా ఉంటాయి. ది వింగ్స్టర్ మెర్సీ, బార్బిక్యూ వార్స్, జెస్టీ రిట్రీట్, మైల్డ్ వేన్జియన్స్, ది గార్లిక్ ఎస్కేప్, ఫెర్రీ వింగ్స్, ది ఫ్లేమింగ్ ఫ్రెంజీ, వింగ్స్ ఆఫ్ ఫైర్ పేర్లతో 1-8 లెవల్స్ ఉంటాయి. లెవల్ పెరుగుతున్న కొద్దీ అందులో స్పైసీ కూడా పెరుగుతుంటుంది. వీటి ధరలు రూ.59-199 మధ్యే ఉంటాయి. త్వరలో మరో రెండు ఔట్లెట్లు.. ప్రస్తుతం రోజుకు 50-70 మంది కస్టమర్లు రెస్టారెంట్‌కు వస్తుంటారు. నెలకు రూ.25-30 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఏడాదికి కోటికి పైగా టర్నోవర్‌ను నమోదు చేస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్స్ తీసుకుంటున్నాం. రోజుకు 50 వరకు ఆర్డర్లొస్తున్నాయి. ఈ నెలాఖరులో జేఎన్టీయూ రోడ్లో, జూన్ కల్లా విజయవాడలోని గురునానక్ కాలనీ రోడ్లో ఔట్లెట్లు ప్రారంభిస్తున్నాం. ఒక్కో ఔట్‌లెట్‌పై రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఫ్రాంచైజీ మోడల్లోనూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు రూ.కోటికి పైగా సొంతగా పెట్టుబడులు పెట్టాం. మరో మూడు నెలల్లో 700-800 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించనున్నాం. జులై నాటికి మిలియన్ డాలర్ల టర్నోవర్‌ను చేరుకోవాలనేది మా లక్ష్యం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
సర్కారీ ఔట్లెట్లు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా ఈ ఏ డాది ఆరుసార్లు టెండర్లు పిలిచినా జిల్లాలో ప దుల సంఖ్యలో మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు కాలేదు. వాటిపై వ్యాపారులు మొగ్గుచూపలేదు. దీంతో మరోసారి టెండర్ పిలిచే ఆలోచనకు స్వస్తిపలికి సర్కారు ఆధ్వర్యంలోనే లిక్కర్ ఔట్లెట్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఓవైపు ప్రజలు మద్యం తాగొద్దంటూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్న ప్రభుత్వమే మద్యం అమ్మకాలకు ముందుకు రానుం డడం అందరినీ విస్మయూనికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) ఆధ్వర్యంలో ఔట్లెట్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆదాయమున్న దగ్గరే.. జిల్లాలో 61 వైన్‌షాప్‌ల నిర్వహణకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ప్ర భు త్వ ఆదాయానికి గండి పడుతోంది. ఆయా చో ట్ల మద్యం దుకాణాలు మూసుకుపోవడంతో దేశీదారు, నాటుసారా, గుడుంబా విక్రయాల జోరు పెరిగిందని ఆబ్కారీ శాఖాధికారులు పే ర్కొంటున్నారు. గతంలో స్థానికంగా మద్యం వ్యాపారం చేసిన వారే మహారాష్ట్ర నుంచి దేశీదారును అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తుండడం.. స్థానికంగా నాటుసారా, గుడుంబా స్థా వరాలు ఏర్పాటు చేసి అమ్ముతుండడంతో స ర్కారు భారీగా ఆదాయం కోల్పోతోందని చెబుతున్నారు. సర్కార్‌కు ఆదాయం రాకుండా చేసి వ్యాపారంలో ఆరితేరినవారు అక్రమంగా చేస్తున్న దందాను అరికట్టేందుకు ఔట్లెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నిచోట్ల కాకుండా ఆదాయం అధికంగా ఉండే చోటనే, గతంలోని విక్రయాలను పరిగణలోకి తీసుకుని ఔట్లెట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఔట్లెట్లో ఒక రిటైర్డ్ ఉద్యోగి సూపర్వైజర్గా, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అసిస్టెంట్ సూపర్వైజర్గా, పదో తరగతి ఉత్తీర్ణులైన ఇద్దరిని సేల్స్‌మన్‌గా నియమించి నడపాలని నిర్ణయించారు. ఏపీబీసీఎల్ నుంచే వారికి వేతనాలు చెల్లించనున్నారు. ఈ మేరకు వారంలోగా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఏపీబీసీఎల్ నుంచి జాయింట్ కలెక్టర్‌కు ఈ ఫైల్ చేరనుంది. జేసీ నుంచి కలెక్టర్ పరిశీలన అనంతరం ఆయన సంతకంతో ఈ ఔట్లెట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పడనుంది. ఆబ్కారీ శాఖ పరిశీలన జిల్లాలో ప్రస్తుతం కాగజ్‌నగర్ సర్కిల్ పరిధిలో, మంచిర్యాల ఐఎంఎల్ డిపో పరిధిలో ఒక్కో షాపు, బెల్లంపల్లి సర్కిల్ పరిధిలోని అకినెపెల్లి ఓల్డ్ మందమర్రిలో రెండు దుకాణాలు మొత్తం నాలుగు దుకాణాలు ఏపీబీసీఎల్ ఆధ్వర్యంలో గతేడాది నుంచి నడుస్తున్నాయి. మిగిలిన 61 వై న్షాపుల్లో ఎక్కడైతే ఆదాయం ఉందో అక్కడే ఏ పీబీసీఎల్ ఆధ్వర్యంలో విక్రయాలు జరపాలనే యోచన ఉండడంతో ఆబ్కారీ శాఖాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఆయూ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎక్కడ ఔట్లెట్ ఏర్పాటు చేయాలనే వరకే ఆబ్కారీశాఖ అధికారులు ఏపీబీసీఎల్‌కు సూచనలు ఇవ్వనున్నారు. ఇక నిర్వహణ బాధ్యత పూ ర్తిగా ఏపీబీసీఎల్ చూస్తుంది. ఎక్సైజ్ శాఖలో ఇప్పటికే భారీగా పోస్టులు ఖాళీగా ఉండడంతో వారు నిర్వహించలేని పరిస్థితి ఉంది. కొందరు రిటైర్డ్ ఉద్యోగులను సూపర్వైజర్లుగా నియమిం చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. -
మద్యం షాపులకు డిమాండ్ కరువు
సాక్షి, విశాఖపట్నం: మద్యం దుకాణాల నిర్వహణకు వ్యాపారులు కరువు కావడం ఎక్సైజ్ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లోని షాపులు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మారిన పరిస్థితు ల్లో లాభాలు తగ్గిపోవడం ఒక కారణమైతే అప్సెట్ ధర అధికంగా ఉండడం కూడా వ్యాపారులు ముందుకు రాకపోవడానికి కారణం. జిల్లాలో 406 మద్యం దుకాణాలుండగా ఇంకా 89 షాపులు లెసైన్స్‌దారుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇందులో సగం వరకు షాపులు గత ఏడాది లాటరీలో ఎవరో ఒకరు దక్కించుకున్నవే. లెసైన్స్ రెన్యువల్‌కు వీరు ముందుకు రాకపోవడంతో గత ఏడాది మిగిలిపోయిన, ఈ ఏడాది రెన్యువల్ కాని షాపులు మొత్తం 89కి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మూడో తేదీన లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని పేర్కొన్నారు. తీరా శుక్రవారం సాయంత్రం బాక్స్ తెరిచి చూసిన ఎక్సైజ్ అధికారులు షాకయ్యారు. కేవలం రెండే రెండు దరఖాస్తులు వచ్చాయి. గాజువాక పరిధిలోని లంకెలపాలెం, పెందుర్తి పరిధిలోని చీమలాపల్లి దుకాణాలకు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. పోటీ లేకపోవడంతో శనివారం అధికారులు, వ్యాపారుల సమక్షంలో ఆ రెండు దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించేశారు. రూ.64 లక్షల చొప్పున అప్సెట్ ప్రైస్ వసూలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆదివారం నుంచి వారికి లెసైన్సులిచ్చేసినట్టేనని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. మిగతా దుకాణాల పరిస్థితి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. మరో రెండు ప్రభుత్వ ఔట్లెట్లు? జిల్లా వ్యాప్తంగా ఇంకా 87 దుకాణాలకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే ఔట్లెట్లు ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కంచరపాలెం, పెందుర్తి ప్రాంతాల్లో ఔట్లెట్లు నడుస్తున్నాయి. మరో రెండు యూనిట్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. వీటి నిర్వహణకు కూడా సిబ్బంది కావాలి. దీంతో సాధ్యాసాధ్యాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త వాటిని ప్రారంభించేయోచనలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.