150కి చేరిన మలబార్ గోల్డ్ షోరూమ్స్ | Proud moment as Malabar Gold opens 150th outlet | Sakshi
Sakshi News home page

150కి చేరిన మలబార్ గోల్డ్ షోరూమ్స్

Published Thu, May 5 2016 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

150కి చేరిన మలబార్ గోల్డ్ షోరూమ్స్

150కి చేరిన మలబార్ గోల్డ్ షోరూమ్స్

హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త మైలురాయిని చేరుకుంది. ఇటీవల ఒమాన్, షార్జా, మెహదీపట్నం, బెలగావిల్లో కొత్తగా ప్రారంభించిన షోరూమ్‌లతో సంస్థ మొత్తం ఔట్‌లెట్స్ (9 దేశాల్లో) 150కి పెరిగాయని మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు పలు రకాల డిజైన్లతో కూడిన ఆభరణాలను అందుబాటులో ఉంచామని, వీటి కొనుగోలుపై  వెండిని ఉచితంగా అందిస్తున్నామని పేర్కొంది. ‘అక్షయ తృతీయ వంటి పండుగల సందర్భంగా  ఆభరణాల కొనుగోలుకు తమ షోరూమ్‌లకు వస్తోన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వినియోగదారులకు ఎప్పుడూ నాణ్యమైన సేవలను అందించడంలో ముందుంటాం’ అని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement