సర్కారీ ఔట్‌లెట్లు
Published Mon, Oct 21 2013 1:56 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా ఈ ఏ డాది ఆరుసార్లు టెండర్లు పిలిచినా జిల్లాలో ప దుల సంఖ్యలో మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు కాలేదు. వాటిపై వ్యాపారులు మొగ్గుచూపలేదు. దీంతో మరోసారి టెండర్ పిలిచే ఆలోచనకు స్వస్తిపలికి సర్కారు ఆధ్వర్యంలోనే లిక్కర్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఓవైపు ప్రజలు మద్యం తాగొద్దంటూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్న ప్రభుత్వమే మద్యం అమ్మకాలకు ముందుకు రానుం డడం అందరినీ విస్మయూనికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) ఆధ్వర్యంలో ఔట్‌లెట్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఆదాయమున్న దగ్గరే..
జిల్లాలో 61 వైన్‌షాప్‌ల నిర్వహణకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ప్ర భు త్వ ఆదాయానికి గండి పడుతోంది. ఆయా చో ట్ల మద్యం దుకాణాలు మూసుకుపోవడంతో దేశీదారు, నాటుసారా, గుడుంబా విక్రయాల జోరు పెరిగిందని ఆబ్కారీ శాఖాధికారులు పే ర్కొంటున్నారు. గతంలో స్థానికంగా మద్యం వ్యాపారం చేసిన వారే మహారాష్ట్ర నుంచి దేశీదారును అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తుండడం.. స్థానికంగా నాటుసారా, గుడుంబా స్థా వరాలు ఏర్పాటు చేసి అమ్ముతుండడంతో స ర్కారు భారీగా ఆదాయం కోల్పోతోందని చెబుతున్నారు.
సర్కార్‌కు ఆదాయం రాకుండా చేసి వ్యాపారంలో ఆరితేరినవారు అక్రమంగా చేస్తున్న దందాను అరికట్టేందుకు ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నిచోట్ల కాకుండా ఆదాయం అధికంగా ఉండే చోటనే, గతంలోని విక్రయాలను పరిగణలోకి తీసుకుని ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఔట్‌లెట్‌లో ఒక రిటైర్డ్ ఉద్యోగి సూపర్‌వైజర్‌గా, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అసిస్టెంట్ సూపర్‌వైజర్‌గా, పదో తరగతి ఉత్తీర్ణులైన ఇద్దరిని సేల్స్‌మన్‌గా నియమించి నడపాలని నిర్ణయించారు. ఏపీబీసీఎల్ నుంచే వారికి వేతనాలు చెల్లించనున్నారు. ఈ మేరకు వారంలోగా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఏపీబీసీఎల్ నుంచి జాయింట్ కలెక్టర్‌కు ఈ ఫైల్ చేరనుంది. జేసీ నుంచి కలెక్టర్ పరిశీలన అనంతరం ఆయన సంతకంతో ఈ ఔట్‌లెట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పడనుంది.
ఆబ్కారీ శాఖ పరిశీలన
జిల్లాలో ప్రస్తుతం కాగజ్‌నగర్ సర్కిల్ పరిధిలో, మంచిర్యాల ఐఎంఎల్ డిపో పరిధిలో ఒక్కో షాపు, బెల్లంపల్లి సర్కిల్ పరిధిలోని అకినెపెల్లి ఓల్డ్ మందమర్రిలో రెండు దుకాణాలు మొత్తం నాలుగు దుకాణాలు ఏపీబీసీఎల్ ఆధ్వర్యంలో గతేడాది నుంచి నడుస్తున్నాయి. మిగిలిన 61 వై న్‌షాపుల్లో ఎక్కడైతే ఆదాయం ఉందో అక్కడే ఏ పీబీసీఎల్ ఆధ్వర్యంలో విక్రయాలు జరపాలనే యోచన ఉండడంతో ఆబ్కారీ శాఖాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఆయూ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎక్కడ ఔట్‌లెట్ ఏర్పాటు చేయాలనే వరకే ఆబ్కారీశాఖ అధికారులు ఏపీబీసీఎల్‌కు సూచనలు ఇవ్వనున్నారు. ఇక నిర్వహణ బాధ్యత పూ ర్తిగా ఏపీబీసీఎల్ చూస్తుంది. ఎక్సైజ్ శాఖలో ఇప్పటికే భారీగా పోస్టులు ఖాళీగా ఉండడంతో వారు నిర్వహించలేని పరిస్థితి ఉంది. కొందరు రిటైర్డ్ ఉద్యోగులను సూపర్‌వైజర్లుగా నియమిం చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం.
Advertisement
Advertisement