హైదరాబాద్: 'కాకతీయ ఫుడ్స్' బ్రాండ్‌తో తెలంగాణ ప్రభుత్వం పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను విక్రయించాలని నిర్ణయించింది. దేశ విదేశాలకు సేంద్రీయ పండ్లు, కూరగాయలు ఎగుమతి చేయాలని... అలాగే కల్తీ లేని కారం, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాలను ఔట్‌లెట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ విధివిధానాలను ఖరారు చేస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఉద్యానాభివృద్ధి సంస్థ పేరుతో కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఆదేశాలిచ్చారు.
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తులు పండిస్తే... రైతులకు లాభసాటిగా చేసేందుకు ఆ ఉత్పత్తులకు అవసరమైన ప్రాసెసింగ్, మార్కెటింగ్ బాధ్యత ఉద్యానాభివృద్ధి సంస్థ చేపడుతుంది. ఈ రెండూ సమన్వయంతో ముందుకు సాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆహార పదార్థాల్లో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుండటంతో ఏం తినాలన్నా భయపడాల్సి వస్తోందని.. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అందుకోసం ఆయన ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
టీ సర్కారు కంపెనీ 'కాకతీయ ఫుడ్స్'
Published Mon, Jun 6 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
Advertisement
Advertisement