సాక్షి, హైదరాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వారిని వ్యాపారవేత్తలుగా మలిచేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని టీఎస్ ఆగ్రోస్ చర్య లు చేపట్టింది. మార్కెట్లో డిమాండ్‌గల చిరుధాన్యా ల ఉత్పత్తుల వ్యాపారంలో మహిళలను భాగస్వాములను చేయాలని, స్టార్టప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారితో రాష్ట్రవ్యాప్తంగా చిరుధాన్యాలు, వాటి ఉత్పత్తులను విక్ర యించేందుకు ఔట్‌లెట్స్ ఏర్పాటు చేయించనుంది.
ఈ దిశగా కసరత్తులో భాగంగా గురువారం హైద రాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి వంద మందికిపైగా ఔత్సాహిక మహిళలు హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రా వు, ప్రత్యేక కమిషనర్ హనుమంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, అక్షయపాత్ర, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
తొలి దశలో...
మిల్లెట్ ఔట్‌లెట్లను తొలిదశలో జిల్లా కేంద్రాల్లో ఒకట్రెండు చొప్పున, జీహెచ్‌ఎంసీ పరిధిలో పది ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని టీఎస్ ఆగ్రోస్, అక్షయపాత్ర నిర్ణయించాయి. త్వరలోనే ఔత్సాహిక మహిళల్ని ఎంపిక చేసి వారికి ఔట్‌లెట్లు కేటాయించేలా కసరత్తు జరుగుతోంది. మిల్లెట్ ఔట్‌లెట్లలో అక్షయపాత్ర కీలకపాత్ర పోషించనుంది. వ్యాపారానికి అవసరమైన చిరుధాన్యాలను, వాటి ఉత్పత్తులను ఈ సంస్థనే సరఫరా చేయనుంది. దీంతోపాటు ప్రత్యేకంగా షాప్ అద్దెకు తీసుకోలేని వారి కోసం ప్రత్యేకంగా కంటెయినర్ షాప్‌లను కూడా అక్షయపాత్ర రూపొందించింది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే టీఎస్ ఆగ్రోస్, అక్షయపాత్ర మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. చిన్నారులు మొదలుకొని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధుల వరకు అవసరమైన చిరుధాన్యాల ఆహారాలను ఈ సంస్థ అందించనుంది. మొత్తం 68 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా చిన్నపిల్లల కోసం చిరుధాన్యాలతో నూడుల్స్, బిస్కెట్స్ వంటి వాటిని కూడా తయారు చేస్తోంది. ఔత్సాహిక మహిళలు పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేకుండానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా టీఎస్ ఆగ్రోస్ రుణాలు ఇప్పించనుంది.
సదస్సులో పాల్గొన్న బ్యాంక్ ప్రతినిధులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికీ వ్యాపార విస్తరణ, పెట్టుబడిని బట్టి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు అందించేందుకు బ్యాంకు ముందుకొచ్చింది. ఈ కార్యక్రమం అనంతరం ఔత్సాహిక మహిళలకు ఏర్పాటు చేసిన భోజనంలో మిల్లెట్ పులిహోర, మిల్లెట్ సాంబార్ ఫుడ్, మిల్లెట్ కర్డ్ ఫుడ్, మిల్లెట్ రోటీ, మిల్లెట్ ఐస్‌క్రీం వంటి వాటిని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment