సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో జాప్యంపై జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని బీహెచ్‌ఈఎల్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. 4,000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ప్లాంట్ పనులపై శుక్రవారం ఆయన బీహెచ్‌ఈఎల్ డైరెక్టర్ ఉపేందర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలింద్ కోపికర్‌తో సమీక్ష నిర్వహించారు.
కూలింగ్ టవర్లు, కోల్/యాష్ ప్లాంట్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయని, వేగం పెంచాలని కోరారు. అలాగే అన్ని యూనిట్లలో పనులు నిరంతరాయంగా జరగాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఏడాది జూన్ నాటికి యాదాద్రి కేంద్రంలోని రెండు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు మూడో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయనకు బీహెచ్‌ఈఎల్ డైరెక్టర్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment