రెండేళ్లలో పవర్ ప్లాంట్లు సిద్ధం!
270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్ల ఏర్పాటు బీహెచ్‌ఈఎల్‌తో టీజెన్‌కో చర్చలు
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ జెన్‌కో కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అత్యంత వేగంగా విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నడుం బిగిం చింది. ఇందులో భాగంగా కేవలం రెండేళ్లలో నిర్ధేశిత లక్ష్యం మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)తో చర్చల ప్రక్రియు ప్రారంభించింది. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లను (మొత్తం 1,080 మెగావాట్లు) రెండేళ్లలో పూర్తి చేసేందుకు బీహెచ్‌ఈఎల్ చైర్మన్ బీపీ రావుతో ఇప్పటికే తెలంగాణ జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్‌రావు చర్చలు జరిపారు. కాగా, బీహెచ్‌ఈఎల్ వద్ద 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు విద్యుత్ ప్లాంటుకు చెందిన బాయిలర్లు, టర్బైన్లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యూనిట్ల ఏర్పాటుకు అనువైన భూమి ఉంటే... ఆ ప్రాంతంలో నేరుగా ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభించవచ్చని టీజెన్‌కో భావిస్తోంది. వాస్తవానికి కొత్త విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ముందు బీహెచ్‌ఈఎల్‌కు వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లాంటుకు అవసరమైన బాయిలర్లు, టర్బైన్లను బీహెచ్‌ఈఎల్ తయారుచేస్తుంది. ఇందుకు ఏడాది, ఏడాదిన్నర సమయం పడుతుంది. అయితే, ఇప్పటికే 270 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బాయిలర్లు, టర్బైన్లు సిద్ధంగా ఉండటం వల్ల ఈ సమయం కలిసి వస్తుందని టీజెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే బీహెచ్‌ఈఎల్ చైర్మన్‌తో చర్చలు జరిపాం. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. సానుకూలత వ్యక్తం చేస్తూ నాకు ఆ సంస్థ చైర్మన్ లేఖ కూడా రాశారు. ఈ విషయూన్ని ముఖ్యమంత్రితో చర్చించి ఓ నిర్ణయూనికి వస్తాం’ అని ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు.
విద్యుత్ సంక్షోభంపై నేడు సీఎం సమీక్ష
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. విద్యు త్ సరఫరా పరిస్థితిపై గురువారం ఆయన సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. భూ గర్భజలాలు అడుగంటిపోవడం, విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతుండటం, రైతు లు సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ డిమాండ్, సరఫరా, లోటు వివరాలను అధికారులు సీఎంకు వివరించనున్నారు. మూడు రోజుల క్రితం వరకూ రాష్ట్రంలో ఎండవేడిమికి డిమాండ్ 160 మిలియన్ యూనిట్లు (ఎంయుూ) దాటడం వల్ల లోటు 24 ఎంయుూల మేరకు ఏర్పడింది. దీంతో భారీగా కోతలు విధించకతప్పలేదని ఇందనశాఖ వర్గాలు తెలిపాయి. అయితే, వర్షాలు కురవడంతో మంగళ, బుధవారాల్లో పరిస్థితి మెరుగుపడిందని, డిమాండ్ 148 ఎంయుూలకు తగ్గిందని, లోటు కేవలం 8 ఎంయుూలకే పరిమితమైందని ఆ వర్గాలు పేర్కొన్నారుు. ఈ వివరాలన్నీ వుుఖ్యవుంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఇంధనశాఖ వర్గాలు వివరించారుు.