Hydro power stations
-
ఇంత సోమరితనమా?
సాక్షి, హైదరాబాద్: ‘జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే.. మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభు త్వానికి లేదు’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు ఉధృతంగా వరదలు కొనసాగుతున్నా, జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోలేకపోతున్నామని మండిపడ్డారు.జలవి ద్యుత్ కేంద్రాలకు సత్వరం మరమ్మతులు నిర్వ హించి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో పునరుద్ధరించాలని ఆదేశించారు. ‘జలకళ ఉన్నా హై‘డల్’’అనే శీర్షికతో ఈ నెల 7న సాక్షిలో ప్రచురించిన కథనంపై స్పందిస్తూ శనివారం ఆయన ప్రజాభవన్‌లో జెన్కో డైరెక్టర్లు, సీఈలతో సమీక్ష నిర్వహించారు. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో.. వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం చేజారిపోయిందనే అంశాన్ని ఈ కథనం ఎత్తిచూపింది. మనసుపెట్టి పనిచేయండి.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమీక్షలో ప్రస్తావిస్తూ.. జెన్కో ఉన్నతాధికారుల పనితీరుపై ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు ఉండరాదని హెచ్చరించారు. శ్రీశైలం, జూరాల తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మర మ్మతుల విషయంలో గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో, వరదలు వస్తున్నా పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసుకోలేక పోతున్నా మని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని ఆదేశించారు. విద్యుదు త్పత్తి కేంద్రాల పనితీరు, ఉత్పాదకతపై వారాని కోసారి తనకు నివేదికలను సమర్పించాలని ఆదే శించారు. విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లు ఏర్పడినా తక్షణమే ఇంధన శాఖ ముఖ్య కార్య దర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరా రు. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహి ంచే చీఫ్ ఇంజనీర్ల నుంచి రాతపూర్వకంగా వివర ణ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరా యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘విద్యుత్’ అంటే నిరంతరం పనిచేయాల్సిన శాఖ.. విద్యుత్ శాఖలో ఉద్యోగమంటే నిరంతరం పని చేయాల్సిన అత్యవసర శాఖలో విధులు నిర్వర్తి స్తున్నామనే అంశాన్ని అన్ని స్థాయిల్లోని అధికా రులు, ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలని భట్టి అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా నని భరోసా ఇచ్చారు. అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 17 రోజుల విద్యుదుత్పత్తికి సరిప డా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఇంధన శాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు అజయ్, వెంకటరాజం, లక్ష్మయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
హైడల్ పవర్ డౌన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎగువ, దిగువ జూరాల వంటి నాలుగు ప్రధాన జల విద్యుత్ కేంద్రాలకు గత కొంతకాలంగా మరమ్మతులు నిర్వహించకపోవడంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం క్షీణించిపోయింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా, టెండర్ల నిర్వహణలో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) తాత్సారం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కృష్ణా నదికి ఎగువ నుంచి వరదలు ప్రారంభం కానుండగా, పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని చేసుకునే పరిస్థితి లేకుండా పోయినట్లు తెలిసింది. ఇదే జరిగితే రూ.కోట్లు విలువ చేసే జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నచిన్న సమస్యలే అయినా.. రాష్ట్రంలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 2441.76 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రాలుండగా, ఎప్పటికప్పుడు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రస్తుతం 329.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలన్నింటిలో ఒక్కో యూనిట్ పనిచేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. గత ఆరు నెలలుగా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో మరమ్మతులు ప్రారంభం కాలేదు. చిన్న చిన్న సమస్యలే ఉండడంతో ఒక్కో కేంద్రం మరమ్మతులకు రూ.10 కోట్లలోపు వ్యయమే కానుండగా, టెండర్లు ఖరారు చేయకపోవడంతో వర్షాకాలంలో ఆయా యూనిట్లలో జల విద్యుదుత్పత్తి నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. సాగర్, శ్రీశైలం కేంద్రాలకూ మరమ్మతులు నో రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాలు సగటున ఏటా 3000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. థర్మల్ విద్యుత్‌తో పోల్చితే అత్యంత చౌకగా కాలుష్యం లేకుండా జలవిద్యుత్ లభిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించిన ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 (6్ఠ39) మెగావాట్లు కాగా ఇక్కడ మూడో యూనిట్ జనరేటర్ సమస్యతో పనిచేయడం లేదు. దిగువ జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 240 (6్ఠ40) మెగావాట్లు కాగా, అందులోని అన్ని యూనిట్లలో సీల్ లీకు అవుతోంది. వీటిల్లో కనీసం ఒక యూనిట్ పనిచేయకపోవచ్చని, తద్వారా 40 మెగావాట్ల విద్యుదుత్పత్తికి నష్టం కలగనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జలవిద్యుత్ కేంద్రమైన ‘శ్రీశైలం’స్థాపిత సామర్థ్యం 900 (6్ఠ150) మెగావాట్లు కాగా, అందులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4వ యూనిట్ పనిచేయడం లేదు. జనరేటర్ స్టేటర్, రోటర్లు కాలిపోవడంతో వాటిని మార్చాల్సి ఉంది.మరో భారీ జలవిద్యుత్ కేంద్రం నాగార్జునసాగర్ స్థాపిత సామర్థ్యం 815.6(1్ఠ110 + 7్ఠ100.8) మెగావాట్లు కాగా, అందులో 100.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ పనిచేయడం లేదు. రోటర్‌కు సపోరి్టంగ్గా ఉండే స్ట్రక్చర్‌కు పగుళ్లు రాగా మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహిస్తే వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘థర్మల్’ ధగధగలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది. గత నెలలో సీలేరు బేసిన్ జలవిద్యుత్ కేంద్రాలు గరిష్ట విద్యుత్ ఉత్పత్తి నమోదు చేయగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగన్నర నెలల్లో థర్మల్ యూనిట్లు తమ సత్తా చాటాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 18 అర్ధరాత్రి వరకూ ఏపీ జెన్కో థర్మల్ యూనిట్లు 10,108.196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 12,994.987 మిలియన్ యూనిట్లు సరఫరా చేయడం విశేషం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేవలం నాలుగన్నర నెలల స్వల్ప వ్యవధిలోనే 2,886.791 మిలియన్ యూనిట్ల అధిక ఉత్పిత్తి జరిగింది. గత ఏడాది ఆగస్టు 18న ఏపీ జెన్కో థర్మల్ విద్యుదుత్పత్తి 60.616 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఇదేరోజు ఉత్పత్తి 84.537 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. పెరిగిన పీఎల్ఎఫ్.. ఏపీ జెన్కో తన అనుబంధ సంస్థ ఏపీపీడీసీఎల్తో కలిపి మొత్తం మూడు ప్లాంట్లలో 5,810 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 18 వరకూ ఈ కేంద్రాలు మొత్తం సగటున 51.84 పీఎల్ఎఫ్ సాధించగా ఈ సంవత్సరం ఇదే కాలంలో 66.61 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ) పీఎల్ఎఫ్ 64.10 నుంచి 72.43 శాతానికి పెరిగింది. అలాగే, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్) పీఎల్ఎఫ్ 73.59 నుంచి 78.38 శాతానికి చేరింది. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం పీఎల్ఎఫ్ 27.46 శాతం నుంచి 53.98 శాతానికి పెరిగింది. సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి.. నిజానికి.. వర్షాకాలంలో తగ్గాల్సిన విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు.. బొగ్గు తడిసి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అయినప్పటికీ రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. ఆర్టీపీపీ మూడో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. గత మే 8న ఏకంగా 224 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి నమోదు చేసింది. ఆర్టీపీపీ ఒకటో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. అదే మే 25న 219 మెగావాట్లు ఉత్పత్తి నమోదైంది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ 6వ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 15న 219 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి జరిగింది. ఇక్కడే ఐదో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 24న 217 మెగావాట్లు ఉత్పత్తి సాధించింది. ఏపీ జెన్కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని.. థర్మల్ యూనిట్లలో విద్యుదుత్పత్తి పెంచడం ద్వారా ఏపీ జెన్కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో మా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలవల్లే ఏపీ జెన్కో ప్రగతిబాటలో పయనిస్తోంది. రాష్ట్ర అవసరాలను 45–50 శాతం వరకూ సమకూరుస్తోంది. రాష్ట్రానికి ఎక్కువ పరిమాణంలో బొగ్గు కేటాయించేలా సీఎం, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. అందువల్లే అంతరాయం లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ రికార్డులు సాధిస్తున్నాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీ జెన్కో -
సీలేరు బేసిన్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే
తెలంగాణకు దక్కని చింతూరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాలు హైదరాబాద్: దిగువ సీలేరుతో పాటు డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందనున్నాయి. పోలవరం ముంపుప్రాంతాల పేరుతో ఏడు మండలాల్లోని 208 నివాసిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన సంగతి తెలిసిందే. దీంతో 460 మెగావాట్ల సామర్థ్యం కలిగిన దిగువ సీలేరుతో పాటు, 25 మెగావాట్ల డొంకరాయి విద్యుత్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందనున్నాయి. వాస్తవానికి లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రం ఖమ్మం జిల్లాలోని చింతూరు వద్ద, డొంకరాయి వద్ద డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అయితే, ఈ ప్లాంట్లతో విద్యుత్ సంస్థలు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కాస్తా 2039 వరకూ అమల్లో ఉంటుంది. పీపీఏ ఉన్నంతవరకు ప్రతివిద్యుత్ కేంద్రం నుంచి ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా కానుందని ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. అప్పటివరకు తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ వాటాలో ఇబ్బందులు లేకున్నప్పటికీ... 2039 తర్వాత మాత్రం ఈ ప్లాంటు మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే చెందనుంది. తద్వారా ఈ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ ఆంధ్రప్రదేశ్‌కే చెందనుంది. సాధారణంగా జల విద్యుత్ ప్లాంట్లలో ఏడాదిలో సగం రోజులు కూడా విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉండదు. అయితే, ఈ ప్లాంట్లతో ఏడాదిలో సుమారు 300 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. అంటే భారీ జల విద్యుత్ కేంద్రాలను తెలంగాణ నష్టపోనుందన్నమాట.