
ఎన్నికలు పూర్తయ్యేవరకు నియోజకవర్గాలను వదిలిపెట్టకండి
రాంచీ సమావేశంలో జార్ఖండ్ ఎన్నికల ఇన్‌చార్జి, స్టార్ క్యాంపెయినర్ భట్టి
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో జరగ నున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని ఉపముఖ్యమంత్రి, జార్ఖండ్ ఎన్నికల ఇన్‌చార్జి, స్టార్ క్యాంపెయినర్ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకోవాలనే ఉత్సాహం అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్‌లోనూ కనిపిస్తోందన్నారు. ఎన్నికల ఇన్‌చార్జిగా జార్ఖండ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన భట్టి శుక్రవారం రాంచీలో జరిగిన రాష్ట్ర పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల సమావేశానికి హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ...అసెంబ్లీ ఇన్‌చార్జీలు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నేతలెవరూ ఎన్నికలు పూర్తయ్యేవరకు తమకు కేటాయించిన నియోజకవర్గాలను వదిలిపెట్టవద్దని సూచించారు. కూటమిలో అసంతృప్తితో ఉన్న నేతలతో చర్చించి వారు ప్రచారంలో పాల్గొనేలా చేయాలన్నారు. ప్రచారాన్ని నిర్వహించాలని, సోషల్‌మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అసెంబ్లీ ఎన్ని కల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫెస్టో తయారీపై అభిప్రాయాలను తెలిపారు. సమావేశంలో కేసీ వేణుగో పాల్, కేశవ్‌మహతో కమలేశ్, గులాం అహ్మద్ మీర్‌సాబ్, బి.కె.హరి ప్రసాద్, రామేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment