కేంద్రమంత్రి అశోక్ దిష్టిబొమ్మ దహనం
గుర్ల: గిరిజన విశ్వ విద్యాలయం కోసం స్థలం సేకరించి తీరా నిర్మిస్తున్నారని అనుకున్నప్పుడు దాన్ని పక్క జిల్లాకు తరలించడం అన్యాయమని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపకుడు డాక్టర్ సుంకరి రమణమూర్తి అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని కచ్చితంగా మన జిల్లాలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్లలో సోమవారం విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం రమణమూర్తి మాట్లాడారు. దళితుల ఉన్నత వి ద్యాభివృద్ధి కోసం పాటు పడాల్సిన నేతలు కేంద్ర, రాష్ట్రమంత్రులు దళారులు, పెత్తందారుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి జి ల్లాను, జిల్లా ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.గిరిజన విశ్వ విద్యాలయం వేరే జిల్లాకు తరలిపోతున్నా కేంద్ర మంత్రి పట్టించుకోవడం లేదని అన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు తోట తిరుపతిరావు, విద్యార్ధిన సేనా నాయకులు సుంకరి నారాయణరావు, సంచాన శ్రీనివాసరావు, గౌరునాయుడు, స్వామి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.