సాక్షి, హైదరాబాద్: జూన్ నుంచి ములుగు మండలం జాకారంలో గిరిజన వర్సిటీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. వర్సిటీతోపాటు వరంగల్ మామునూరులో వెటర్నరీ కాలేజీని ప్రారంభించే విషయమై బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. కాలేజీ కోసం ప్రభుత్వం గతేడాది రూ.109.69 కోట్లు మంజూరు చేసిందని కడియం చెప్పారు. కాలేజీలో ప్రవేశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం లేఖ రాశామని అధికారులు కడియం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గిరిజన వర్సిటీ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని కడియం చెప్పారు. వర్సిటీ కోసం భూమిని సేకరించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాయాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment