సాక్షి, గుంటూరు: విద్యా రంగం కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తొమ్మిదేళ్ల విజయనగరం కల తీర్చనున్నారు. ఆగష్టు 25వ తేదీన విజయనగరం జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్ధాపన కార్యక్రమం జరగనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన మెంటాడలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరగనుంది. ఇక విభజన హామీ మేరకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి.. త్వరగతిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది.
విజయనగరం యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న కోర్సులతో పాటు పరిశోధనల కోసం కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment