
విద్యార్థులకు బ్యాగ్‌లు, పుస్తకాలు అందిస్తున్న ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు
సాక్షి, విజయనగరం టౌన్ : రైల్వే హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్ ఆవరణలో ఆదివారం స్కూల్ బ్యాగ్‌లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ ఇతరత్రా వస్తువులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్‌టౌన్ ఎస్‌ఐ కిల్లారి కిరణ్ కుమార్ నాయుడు హాజరై మాట్లాడారు. సమాజానికి సేవ చేసే అవకాశం రావడం చాలా గొప్ప అదృష్టమని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని, ఉద్యోగంతో పాటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న సభ్యులను అభినందించారు. రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సత్యనారాయణ, సంస్థ సభ్యులు వైశాఖ్, ఎం.కనకరాజు, నాగేశ్వరరావు, మురళీ, జైశంకర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.