
సమావేశంలో మాట్లాడుతున్న రామరాజు
విజయనగరం ఫోర్ట్ : రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషన్‌రేట్ జాయింట్ డైరెక్టర్ రామరాజు, విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ నారాయణ చౌదరి అన్నారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో వారు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. వర్షాధార భూములు కాబట్టి చెరువులను అభివృద్ధి చేయించాలన్నారు. వ్యవసాయ శాఖ జేడీ జి.ఎస్.ఎన్.లీలావతి, డీడీ పి.అప్పలస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment