మీరు బ్యాంకు బ్రాంచు వద్ద పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయించుకుంటున్నారా? అయితే ఇక నుంచి దానికోసం కూడా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్‌బుక్ అప్‌డేటింగ్‌కు ఛార్జీలు విధించాలని ప్లాన్ చేసింది. ఒక్కోసారి పాస్‌బుక్ అప్‌డేషన్‌కు 10 రూపాయల ఛార్జీలు విధించాలని తన వెబ్‌సైట్‌లో ఓ నోటీసులో తెలిపింది. తాము ప్రతిపాదించిన ఈ ఛార్జీలు 2018 జనవరి 20 నుంచి అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది. ఏ బ్యాంకు కూడా పాస్‌బుక్ అప్‌డేషన్‌కు ఛార్జీలు విధించడం లేదు. బ్యాంకు ఆఫ్ ఇండియానే ఈ ఛార్జీలనే అమల్లోకి తీసుకొస్తుంది. ఉచితంగా లభించే పలు బ్యాంకు సర్వీసులకు ఛార్జీలను విధించనున్నట్టు బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. ఈ సర్వీసుల్లో పాస్‌బుక్ అప్‌డేషన్ కూడా ఉన్నట్టు తెలిపింది.
ఒక్కోసారి అప్‌డేషన్‌కు రూ.10 ఛార్జీలను విధించనున్నామని, ఈ ఛార్జీలను ఆటోమేటిక్‌గా అకౌంట్ హోల్డర్స్ అకౌంట్‌ను డెబిట్ చేసుకోనున్నట్టు నోటీసులో పేర్కొంది. అంతేకాక ఛార్జీలు విధించబోతున్న సర్వీసుల్లో నగదు విత్‌డ్రా, నగదు డిపాజిట్, బ్యాలెన్స్ స్టేట్‌మెంట్, కైవేసీ అప్‌డేట్, సంతకం, ఫోటో వెరిఫికేషన్, చెక్ డిపాజిట్, వడ్డీ సర్టిఫికేట్ పొందడం, ఇంటర్నెట్ లేదా మొబైల్ పాస్‌వర్డ్‌ను అన్‌బ్లాక్ చేసే అభ్యర్థనలు కూడా ఉన్నాయి. ఈ ఛార్జీలన్నీ జనవరి 20 నుంచి అమల్లోకి వస్తున్నాయని బ్యాంకు తెలిపింది. ప్రతిపాదనల్లో కేవలం రెండు సర్వీసులు మాత్రమే ఉచితంగా లభించనున్నాయి. అవి చెల్లింపులు ఆపడం, సూచనల అభ్యర్థనలు. ఆసక్తికరంగా ఈ ఛార్జీలు, బేస్ బ్రాంచు విధిస్తున్న సర్వీసు ఛార్జీలు కన్నా అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం విధిస్తున్న ఛార్జీల సర్వీసులు, అంతకముందు ఉచితంగా లభ్యమయ్యేవి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment