న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) నికర లాభం జనవరి-మార్చి(క్యూ4) కాలంలో 26% క్షీణించి రూ. 557 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 756 కోట్లను ఆర్జించింది. ఇదే కాలానికి బ్యాంక్ ఆదాయం మాత్రం రూ. 9,266 కోట్ల నుంచి రూ. 11,274 కోట్లకు ఎగసింది.
ఇక పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంక్ నికర లాభంరూ. 2,749 కోట్ల నుంచి నామమాత్రంగా రూ. 2,729 కోట్లకు తగ్గింది. అయితే మొత్తం ఆదాయం రూ. 35,675 కోట్ల నుంచి రూ. 42,202 కోట్లకు పుంజుకుంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ. 2,819 కోట్ల నుంచి రూ. 2,987 కోట్లకు పెరిగింది. ఈ బాటలో ఆదాయం సైతం రూ. 35,880 కోట్ల నుంచి రూ. 42,444 కోట్లకు ఎగ సింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు 3.4% నష్టపోయి రూ. 263 వద్ద ముగిసింది.