![BSE profit is Rs 52 crore - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/4/SENSEX.jpg.webp?itok=UvAD7X52)
ముంబై: బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్‌ఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో రూ.52 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభంతో పోల్చితే 4 శాతం వృద్ధి చెందిందని బీఎస్‌ఈ తెలిపింది. మొత్తం ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.166 కోట్లకు పెరిగిందని బీఎస్‌ఈ ఎమ్‌డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆశీష్‌కుమార్ చౌహాన్ తెలిపారు.
కార్యకలాపాల ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.117 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. కరెన్సీ డెరివేటివ్ సెగ్మెంట్ సగటు రోజువారీ టర్నోవర్ 73 శాతం వృద్ధితో రూ.31,418 కోట్లకు పెరిగిందని ఆశీష్ కుమార్ తెలిపారు. ఫలితాల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో బీఎస్‌ఈ షేర్ 2.5 శాతం లాభంతో రూ.823 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment