
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి(2022–23)గాను పీఎస్‌యూ.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించింది. షేరుకి రూ. 2 చొప్పున ప్రభుత్వానికి రూ. 668 కోట్లకుపైగా అందించింది. బ్యాంక్ ఎండీ రజనీష్ కర్ణాటక్ ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి సమక్షంలో డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు.
2023 మే 30న బ్యాంకు డైరెక్టర్ల బోర్డు షేరుకి 20 శాతం చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు అంగీకరించింది. గతేడాది బీవోఐ నికర లాభం 18 శాతంపైగా బలపడి రూ. 4,023 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22)లో రూ. 3,405 కోట్లు మాత్రమే ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది బ్యాంక్ నిర్వహణ లాభం 34 శాతం జంప్‌చేసి రూ. 9,988 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment