ముంబై: వృద్ధులకు ఆర్థికంగా మరింత రక్షణ అవసరం కావడంతో, దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘శుభ్ ఆరంభ్ డిపాజిట్’ స్కీమ్‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం తీసుకొచ్చిన ఈ డిపాజిట్ పథకంలో అదనంగా 0.50 శాతం రేటును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది.
80 ఏళ్లు నిండిన వారికి 0.65 శాతం అదనంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. 501 రోజుల ఈ డిపాజిట్ స్కీమ్‌లో 60 ఏళ్లు నిండిన వారికి వడ్డీ రేటు 7.65 శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 7.80 శాతం లభిస్తుంది. ఇక 7 - 10 ఏళ్ల కాల వ్యవధుల డిపాజిట్లపైనా ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment