
110 వారాల డిపాజిట్ స్కీమ్ పొడిగింపు: ఎస్‌బీహెచ్
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) 110 వారాల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని మే 31వ తేదీ వరకూ పొడిగించింది. 9.11 శాతం ఆకర్షణీయమైన వడ్డీరేటును ఈ స్కీమ్ కింద బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు అదనంగా మరో అరశాతం వడ్డీ అందుతుంది. డిపాజిటర్లకు రుణం, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. కనిష్టంగా రూ.1,000 నుంచి రూ. 99 లక్షల వరకూ ఈ పథకం కింద డిపాజిట్ చేసుకోవచ్చు. అవసరమైతే డిపాజిట్ చేసిన 7 రోజుల తరువాత తమ డబ్బును కస్టమర్లు ఎటువంటి జరిమానా లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఐలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.