
అవ్వా, తాతలకు ప్రత్యేక ప్రదర్శన
నిరుపేద వృద్ధుల కోసం నుమాయిష్ ప్రత్యేకం
నగరంలోని వృద్ధాశ్రమాలు, హోమ్స్‌లోని వారికి చోటు
స్కూల్స్, వాలంటీర్లు, నుమాయిష్ నిర్వాహకుల సహకారం
నగరానికి చెందిన దోబారా ఎన్జీవో సేవా కార్యక్రమం
వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు.. చంటి పిల్లలకు ఎలా అయితే అన్నీ చూడాలని ఆశ ఉంటుందో వయస్సు పెద్దపడిన వారికి కూడా ప్రతిదానిపై ఆసక్తి ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచన చేసిన నగరానికి చెందిన దోబారా అనే ఎన్జీవో.. వారి కోసం అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలోని అపోలో హోంకేర్, గ్లెన్‌ఫీల్డ్ మల్లారెడ్డి తదితర ప్రైవేటు ఆస్పత్రులు, స్కూల్స్‌ను భాగం చేస్తూ నిరుపేద వృద్ధుల కోసం ప్రత్యేక నుమాయిష్ సందర్శనను ఏర్పాటు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సై అన్నారు. అయితే రోజువారీ వేళల్లో అయితే పెద్ద వయసు వారికి రద్దీలో, జనం మధ్యన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా 2గంటల నుంచీ సాయంత్రం రద్దీ మొదలయ్యే లోగా దీనిని పూర్తి అయేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు.
అనాధాశ్రమాల నుంచి..
నగరవ్యాప్తంగా 89 మంది వీల్‌చైర్స్ ఉప్పల్, చిక్కడపల్లి.. ఇలా నగరంలోని 12 ఓల్డేజ్ హోమ్స్, సీనియర్ సిటీజన్ అసోసియేషన్‌లకు చెందిన సభ్యులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. పెద్దలు అందరినీ కార్లలో గౌరవంగా తోడ్కొని వచ్చారు. అక్కడ నుంచి నడవలేని వారి కోసం దాదాపుగా 80కిపైగా వీల్‌ఛైర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా నర్సింగ్ స్కూల్స్‌కు సంబంధించిన విద్యార్థులను కూడా ఉంచారు. వీరి కోసం ప్రత్యేకంగా ఉచిత ట్రైన్ రైడ్స్‌ను నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అదే విధంగా వాహనాల కోసం ఉచిత పార్కింగ్‌ను కూడా కలి్పంచారు.

ఫుడ్ ప్యాక్స్..
పిస్తా హౌజ్, షాజ్ మహమ్మూద్ అనే వాలంటీర్‌ల సహకారంతో ఫుడ్ ప్యాక్స్ అందించారు. అలాగే కొందరు దాతలు ఇచి్చన సహకారంతో వృద్ధులకు ఉపయోగపడే టవల్స్ వంటివి కొనుగోలు చేసి అందించారు.

పెద్దలకు ప్రత్యేకంగా..
ఏడాదికో సారి నుమాయిష్ లాంటి ప్రదర్శనను తిలకించాలని అందరూ అనుకున్నట్టే సీనియర్ సిటిజన్స్ కూడా ఆశిస్తారు. అయితే ఆశించినట్టుగా చాలా మందికి జరగకపోవచ్చు. కొందరికైనా దీన్ని సాకారం చేద్దామనే ఆలోచనతో ఈ ‘సీనియర్ సిటిజన్స్ ఎట్ నుమాయిషి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక సీనియర్ సిటిజన్‌గా పెద్దలకు సంబంధించిన జెరంటాలజీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ చేసిన వ్యక్తిగా ఇలాంటి కార్యక్రమాలు పెద్దవాళ్ల మనసుకు ఎంత సంతోషాన్ని అందిస్తాయనేది నాకు తెలుసు.
– మతీన్ అన్సారీ, వ్యవస్థాపకులు, దోబారా స్వచ్ఛంద సంస్థ
Comments
Please login to add a commentAdd a comment