తిరువళ్లూరు: లాకర్లు బద్దలుకొట్టకుండా, కనీసం గోడకు కన్నం కూడా వేయకుండా ఓ బ్యాంకు లాకర్లలో దాచిన 32 కేజీల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. బ్రాంచ్ మేనేజర్ శేఖర్, అసిస్టెంట్ మేనేజర్లు భాను, రంజన్, కీ మెయింటైనర్ విశ్వనా థన్‌లు శుక్రవారం విధులు ముగించుకుని బ్యాంకుకు తాళంవేసి ఇంటికి వెళ్లారు.
వరుసగా రెండ్రోజులు సెలవు కావడంతో సోమవారం మేనేజర్ శేఖర్ బ్యాంకు వద్దకు వచ్చారు. అప్పటికే బ్యాంకు తెరిచి ఉండటంతో లోపలకు వెళ్లగా.. నగలు భద్రపరిచే లాకర్ తెరిచిఉంది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రూ.8 కోట్లు విలువచేసే 32.77 కేజీల బంగారం చోరీకి గురైందని నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్ని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment