Chori
-
‘మణప్పురం’ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్: ఎట్టకేలకు మణప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించగలిగారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను, మరో ముగ్గురిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా ఎస్పీ పీ జాషువా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్రమ మార్గంలో సంపాదన గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని డిగ్రీ వరకు చదువుకుంది. వివాహమైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్‌లోన్ మేనేజర్‌గా పనిచేస్తోంది. జిల్లాలోని ముదినేపల్లి, పెడన, బంటుమిల్లి బ్రాంచ్‌లలో పనిచేసి, ఇటీవల కంకిపాడు బ్రాంచ్‌కు బదిలీపై వెళ్ళింది. గోల్డ్‌లోన్ కోసం తరచూ ఆఫీసుకు వచ్చే కృత్తివెన్ను మండలం, పోడు గ్రామానికి చెందిన రేవు దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా చనువుగా మారింది. దుర్గాపస్రాద్ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుని మణప్పురం ఫైనాన్స్‌లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఆభరణాలు తనఖా పెట్టకుండా దుర్గాప్రసాద్‌కు పావని లక్షల రూపాయలు బదిలీ చేసింది. అలాగే తాకట్టులో ఉన్న నగలును పెద్దమొత్తంలో అప్పజెప్పింది. పది నెలల్లో సుమారు రూ.3.60 కోట్లకు పైబడి విలువ చేసే దాదాపు 10.650 కిలోల బంగారాన్ని ఇద్దరూ కలిసి అపహరించారు. ఆడిట్‌తో గుట్టురట్టు వీరి పన్నాగానికి బందరు మండలం, పోలాటితిప్ప గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తమ్ముడు కొక్కిలిగడ్డ నాగబాబు, కంకిపాడు మణప్పురం ఫైనాన్స్ సంస్థ హౌస్ కీపర్ మిట్టగడుకుల ప్రశాంతి సహకరించారు. అపహరించిన నగలును దుర్గాపస్రాద్ మచిలీపట్నం సహా విజయవాడలోని కోస్టల్ సెక్యూరిటీ బ్యాంకు, సౌత్ సెంట్రల్ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పలు దఫాలుగా తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. ఈనెల 16న ఒకేసారి తాకట్టులో ఉన్న ఏడు కిలోల బంగారు ఆభరణాలను పావని చోరీ చేసి పరారైంది. విషయం తెలుసుకున్న మణప్పురం శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించగా, విషయం బయటపడింది. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ జాషువా డీఎస్పీ స్థాయి అధికారులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నెప్పలి గ్రామంలోని డొంకరోడ్డులో పావని, దుర్గాప్రసాద్, వారికి సహకరించిన నాగబాబు, ప్రశాంతిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారాన్ని వందశాతం రికవరీ చేశారు. నగదు కొంత వాడుకున్నట్టు గుర్తించగా, మిగిలిన సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు. -
భక్తులారా జాగ్రత్త..గణేష్ లడ్డు మాయం..
-
అలా జరగడంతో భయమేసింది.. 30 సెకన్లలో బయటపడ్డా: నటి
Nushrratt Bharuccha Recalls Her Paranormal Experience: సినిమా అంటేనే ఊహాజనిత ప్రపంచం. మూవీ వరల్డ్‌లో అనేక జానర్స్ ఉంటాయి. అందులో ఒకటి హార్రర్ జానర్. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెట్టి వాళ్ల నటనతో భయపెడ్తుంటారు యాక్టర్స్. మరీ అలాంటి భయం యాక్టర్స్‌కు నిజ జీవితంలో ఎదురైతే ? ప్రేక్షకులను వారి సినిమాలతో భయపెట్టిన నటీనటులు ప్రాణ భయంతో పరుగులుపెడితే ! అవును. అలాంటి భయానక ఘటనే జరిగింది ఓ నటికి. బాలీవుడ్ నటీ నుష్రత్ భరుచ్చా ప్రస్తుతం ఫ్యూరియా దర్శకత్వంలో విడుదలైన 'చోరీ' సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె 8 నెలల గర్భిణీ సాక్షి పాత్ర పోషించింది. ఈ సినిమా 2017లో విమర్శకుల ప్రశంసలు పొందిన మరాఠీ హార్రర్ 'లపచ్చాపి' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన భయానక సంఘటన గురించి చెప్పింది నుష్రత్. సినిమా షూటింగ్ కోసం ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేయాల్సి వచ్చిందట. అప్పుడు తనకు జరిగిన వింత అనుభవాన్ని గుర్తు చేసుకుంది. 'హోటల్ ఉన్నప్పుడు నాకు కొంచెం విచిత్రంగా తోచింది. నేను నా సూట్‌కేస్‌ను టేబుల్‌పై తెరచి ఉంచి పడుకున్నాను. తెల్లారి లేచి చూసే సరికి నా సూట్‌కేస్ టేబుల్‌పై లేదు. నేలపై ఉంది. అంతేకాకుండా నా బట్టలు చిందరవందరగా నేలపై పడి ఉన్నాయి. అది నేను చేయలేదు. అక్కడ అంతా మాములుగా అనిపించలేదు. నాకు చాలా భయమేసింది. నా ప్రాణాల కోసం పరిగెత్తి 30 సెకన్లలో హోటల్ నుంచి బయటపడ్డాను.' అని నుష్రత్ భరుచ్చ తెలిపింది. నుష్రత్ నటించిన చోరీ నవంబర్ 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. 'సాక్షి, తనకు పుట్టబోయే బిడ్డను దుష్టశక్తులు ఎలా వెంబడించాయి. వాటినుంచి సాక్షి ఎలా పోరాడింది.' అనేది సినిమా కథ. -
కళామందిర్‌కు కన్నమేశాడు
సాక్షి, హైదరాబాద్: తాను పని చేస్తున్న షాపింగ్మాల్కే కన్నమేశాడు ఓ సెక్యూరిటీ గార్డ్. ఆ సంస్థకు రక్షణ కల్పించాల్సింది పోయి సుమారు రూ. 9 లక్షలు దొంగిలించిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేసన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ నర్సింగరావు వివరాల ప్రకారం.. భాగ్యనగర్‌కాలనీలోని కళామందిర్ వస్త్ర దుకాణంలో నాలుగేళ్లుగా అస్సాంకు చెందిన మోనీదాస్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ నిర్వాహకులు అతనిపై నమ్మకంతో షాపింగ్ మాల్ తెరవడం, మూసే బాధ్యతలు అప్పగించారు. ఇదే అదనుగా చేసుకున్న మోనీదాస్ లాకర్‌కు మారుతాళం చేయించాడు. శనివారం తాళాలు వేసిన మోనీదాస్ అసలైన తాళం తీసుకొని, మారు తాళాన్ని మేనేజర్‌కు అందజేశాడు. ఆదివారం లాకర్ తీస్తుండగా ఎంతకూ రాకపోవడంతో ఆరా తీయగా నకిలీతాళం అని తేలింది. అయితే.. అదేరోజు మోనీదాస్ సైతం విధులకు హాజరు కాకపోవటంతో అనుమానం తలెత్తింది. మరో తాళం తెప్పించి లాకర్లో చూడగా రూ. 9 లక్షలు పోయినట్లు గుర్తించారు. సమీపంలోని అతని ఇంటికెళ్లి చూడగా అప్పటికే భార్యా పిల్లలతో పరారైనట్లుగా గుర్తించారు. ఈ పని మోనీదాస్దేనని భావించి పోలీసులకు సమాచారం అందజేశారు. మేనేజర్ మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటితాళం పగలగొట్టి.. ఇంటి తాళం పగలగొట్టి నగదు అపహరించిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బాలాజీనగర్ సాయిరాం ఎన్‌క్లేవ్‌లో నివాసముండే సురేష్ నెలక్రితం వైజాగ్‌కు వెళ్లాడు. ఆదివారం రాత్రి ఇంటి తాళం పగలగొట్టి బంగారం గొలుసు, ఓ ఉంగరం దొంగిలించారు. సమాచారం అందుకున్న సురేష్ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని.. -
లాయర్ ఫీజు ఇచ్చేందుకు చోరీలు
బనశంకరి (కర్ణాటక): జైలు నుంచి విడుదల కావడానికి జామీను ఇప్పించిన న్యాయవాదికి డబ్బు చెల్లించడానికి ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను శుక్రవారం కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్, వసీమ్ గతంలో అనేక ఇళ్లలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వీరిద్దరికి న్యాయవాది జామీను ఇప్పించి బయటకు తీసుకొచ్చారు. న్యాయవాది ఫీజు చెల్లించడానికి జైలు నుంచి విడుదలైన అనంతరం సయ్యద్, వసీమ్ ఇద్దరూ మళ్లీ చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చోరీసొత్తును బంగారు దుకాణాల్లో విక్రయించి న్యాయవాదికి ఫీజు చెల్లించి మిగిలిన డబ్బుతో జల్సాలు చేసేవారు. కోరమంగళ మాత్రమే కాకుండా ఆడుగోడి, తిలక్‌నగర, బొమ్మనహళ్లితో పాటు ఆరుకు పైగా పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో వెలుగుచూసిందని బెంగళూరు దక్షిణ డీసీపీ ఇషాపంత్ తెలిపారు. -
‘చిట్‌ఫండ్’లో రూ.4.5 లక్షల నగదు చోరీ
కాజీపేట: వరంగల్ నగరంలోని దర్గాకాజీపేట చౌరస్తాకు కూతవేటు దూరంలో ఉన్న భద్రం చిట్‌ఫండ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.4.5 లక్షల నగదు అపహరించారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యా దు మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దర్గాకాజీపేకు చెందిన 8 మంది మిత్రులు కలిసి భద్రం చిట్‌ఫండ్‌తోపాటు ఎస్ఆర్ఆర్ ఎంటర్ ప్రైజేస్ ఏర్పాటు చేశారు. గురువారం వినాయక చవితికావడంతో కంపెనీలో పార్ట్నర్లు పూజలు చేసి ఎప్పటిలాగే తాళాలు వేసి ఇళ్లకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కార్యాలయం శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్ తాళాలు తీసి ఉండడం గమనించి యజమానులకు తెలియజేయగా దొంగతనం జరిగినట్లుగా నిర్థారించారు. కంపెనీ ఎండీ బండి సాంబయ్యతో కలిసి సభ్యులు రూ.4.5లక్షల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ వెంకటరెడ్డి, సీఐ అజయ్ తోపాటు క్రైమ్ పోలీసుల బృందం, మడికొండ సీఐ సంతోష్ ఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించగా డాగ్‌స్క్వాడ్ సిబ్బంది చుట్టుపక్కల గాలించారు. కంపెనీలో చొరబడిన దొంగలు నగదుతోపాటు లోపల ఏర్పా టు చేసిన సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను పట్టుకు వెళ్లారు. పోలీసు జాగాలాలు భవనం వెనుక నుంచి ఫాతిమానగర్ ప్రధాన రహదారి సమీపానికి వచ్చి ఆగిపోయాయి. విభిన్న కోణాల్లో విచారణ.. చిట్‌ఫండ్‌లో జరిగిన దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసులు కార్యాలయంలో పనిచేసే సిబ్బందితోపాటు కంపెనీ డైరెక్టర్లు, నిత్యం వచ్చి పోయే వారిని వేర్వేరుగా పిలిపించి విచారణ జరుపుతున్నారు. కార్యాలయంలో ఇంత మొత్తం డబ్బు ఉన్నట్లుగా తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండొచ్చని.. లేదా ప్రొఫెషనల్ దొంగలు ఎవరైనా ఈ పని చేశారా అనే కోణంలో డీసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. -
కన్నం వేయకుండానే 32 కేజీల బంగారం చోరీ
తిరువళ్లూరు: లాకర్లు బద్దలుకొట్టకుండా, కనీసం గోడకు కన్నం కూడా వేయకుండా ఓ బ్యాంకు లాకర్లలో దాచిన 32 కేజీల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. బ్రాంచ్ మేనేజర్ శేఖర్, అసిస్టెంట్ మేనేజర్లు భాను, రంజన్, కీ మెయింటైనర్ విశ్వనా థన్‌లు శుక్రవారం విధులు ముగించుకుని బ్యాంకుకు తాళంవేసి ఇంటికి వెళ్లారు. వరుసగా రెండ్రోజులు సెలవు కావడంతో సోమవారం మేనేజర్ శేఖర్ బ్యాంకు వద్దకు వచ్చారు. అప్పటికే బ్యాంకు తెరిచి ఉండటంతో లోపలకు వెళ్లగా.. నగలు భద్రపరిచే లాకర్ తెరిచిఉంది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రూ.8 కోట్లు విలువచేసే 32.77 కేజీల బంగారం చోరీకి గురైందని నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్ని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. -
మహబూబాబాద్‌లో భారీ చోరీ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. 45.5 తులాల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, టౌన్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో నివసిస్తున్న జడల లక్ష్మీరేణుక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ఎంపీపీఎస్‌లో క్లర్క్‌గా పనిచేస్తోంది. తన అన్న అనారోగ్యంగా ఉండటంతో పరామర్శించేందుకు గురువారం సాయంత్రం ఇంటికి తాళంవేసి వరంగల్ వెళ్లింది. రాత్రి కావడంతో అక్కడే నిద్రించి శుక్రవారం ఉదయం మహబూబాబాద్‌కు తిరిగి వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. అందులోని 45.5 తులాల బంగారు నగలు, రూ.7వేల నగదు చోరీకి గురయ్యాయి. -
మదనపల్లెలో పట్టపగలు భారీ చోరీ
మదపసల్లె క్రైం : మదనపల్లె పట్టణంలో గురువారం పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. బీరువా లాకర్లను ధ్వంసంచేసి అందులో ఉన్న 300 గ్రాముల బంగారు నగలు, రూ.లక్ష నగదు అపహరించారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కదిరి రోడ్డు న్యాయమూర్తుల బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్న పరుపుల వ్యాపారి దర్బార్‌బాషా, అతని భార్య దిల్షాద్ గురువారం ఉదయం ఇంటికి తాళం వేసుకుని ఎస్టేట్‌లో పరుపులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోనికి వెళ్లి పరిశీలించారు. బీరువాలు, కప్‌బోర్డులను పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఈ విషయమై వన్‌టౌన్ ఎస్ఐ సుమన్‌ను వివరణ కోరగా చోరీపై తమకు ఫిర్యాదు అందిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఇంట్లో నిద్రిస్తుండగానే చోరీ!
సాక్షి, కుషాయిగూడ: ఇంట్లోని వాళ్లు నిద్రిస్తుండగానే దొంగలు లోనికి చొరబడి ఎంచక్కా తమ పని కానిచ్చుకుని వెళ్లిపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ ఎ.ఎస్.రావు నగర్లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదిమల్లు అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో దొంగలు చాకచక్యంగా ఆ ఇంటి తలుపు గడియ తొలగించి లోపలికి జొరబడ్డారు. పది తులాల బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. -
పాత నోట్లకు దొంగలూ ‘నో’
-
పాత నోట్లకు దొంగలూ ‘నో’
చెన్నైలోని ఓ ఇంట్లో చోరి.. పాత నోట్లు ఇల్లంతా చల్లిన వైనం సాక్షి ప్రతినిధి, చెన్నై: చోరీ చేసేందుకు ఇంట్లో చొరబడిన దొంగలు నగలను మాత్రం మూటకట్టుకుని, రద్దరుున నోట్లను ఇల్లంతా చల్లి వెళ్లిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై శివారు ప్రాంతం వేప్పంబట్టులో నివసించే రిటైర్డు ఎరుుర్ఫోర్సు అధికారి స్టాన్లీ సెల్వం బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులు సహా టీనగర్‌లోని అత్తవారింటికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. అలాగే లోనికి వెళ్లి చూడగా బీరువాలోని 50 సవర్ల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. దొంగలు అదే బీరువాలో ఉన్న రూ.95 వేల (రూ.500, రూ.1000) పాత కరెన్సీ నోట్లను ఇల్లంతా చల్లి వెళ్లారు. -
పట్టపగలే భారీ చోరీ
30 కాసుల బంగారం, రూ.60 వేల అపహరణ కాకినాడలో వృద్ధురాలిని తాళ్లతో బంధించిన వైనం కాకినాడ క్రైం : అది కాకినాడ భానుగుడి సెంటర్. సోమవారం ఉదయం 9 గంటల సమయం. ముగ్గురు ఆగంతకులు ముసుగులు ధరించి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో చొరబడ్డారు. ఆమెను తాళ్లతో బంధించి çసుమారు 30 కాసుల బంగారం, రూ.60 వేల నగదును అపహరించుకుపోయారు. వివరాల్లోకెళితే.. స్థానిక భానుగుడి సెంటర్ భానులింగేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీరామ్‌నగర్‌లో ఉన్న ఓ భవనం రెండో అంతస్తులో కొప్పర్తి ఆనంద్‌కృష్ణ నివసిస్తున్నారు. ఆయన ఇంట్లోకి ఉదయం 9 గంటల సమయంలో ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల కె.రమణమ్మ నోటికి జాకెట్‌తో కట్టి, కాళ్లు చేతులు పసుపు తాడుతో బంధించారు. సుమారు రూ.7.50 లక్షల విలువైన 30 కాసుల బంగారం, అలమారాలో ఉన్న రూ.10 వేలు, బీరువాలో ఉన్న రూ.50 వేల నగదును తస్కరించారు. ఇంట్లో కారంపొడి చల్లి, పరారయ్యారు. తన భర్త ఆనంద్‌కృష్ణ భానులింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన, కొన్ని క్షణాల్లోనే దుండగులు ఇంట్లోకి చొరబడ్డారని బాధితురాలు తెలిపింది. తొలుత ఇద్దరు ఇంటిలోకి వచ్చారని, మరో వ్యక్తి గుమ్మం వద్ద నిలబడినట్టు పేర్కొంది. సమాచారం అందుకున్న రెండో పట్టణ క్రైం ఎస్సై రామారావు తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆ«ధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల క్రితం శ్రీరామ్‌నగర్‌కు చెందిన కొప్పర్తి రంగారావు ఇంట్లో ఇదే తరహాలో చోరీ జరిగింది. కాగా ఆనందకృష్ణ స్వయానా రంగారావుకు సోదరుడు. రెండు చోట్ల ఒకే ముఠాకు చెందిన వారు చోరీలకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
దొంగలు దొరికారు
– దేవాలయాలు లూటీ చేసిన దొంగల ముఠా అరెస్ట్ – రూ.1.70 లక్షలు విలువ చేసే సొమ్ము, రూ.31 వేల నగదు, ఆటో స్వాధీనం – 16 కేసుల్లో పది మంది జైలుకు – నిందితుల్లో ఒకరు పూజారి రెండు నెలలుగా పోలీసులకు సవాల్ విసురుతూ ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ఎట్టకేలకు దొరికింది. హుండీలు ఎత్తుకెళ్లడం, స్వామి అమ్మవార్ల ఆభరణాలు అపహరించడం.. భక్తులు సమర్పించిన సామగ్రిని మాయం చేయడం ఈ ముఠా చేతివాటం. దాదాపు 16 ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. గుళ్లకు కన్నం వేసే పది మంది ముఠా సభ్యులకు ఓ పూజారి ముఠా పెద్ద కావడం విశేషం. నంద్యాల పోలీసులు చాకచక్యంగా ఈ ముఠాను అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. – కర్నూలు దేవుడి సొమ్ము అపహరిస్తూ.. దర్జాగా తప్పించుకు తిరుగుతున్న ముఠాను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది. వరుస చోరీలతో పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ అప్రమత్తం చేసి దేవాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ మేరకు దీబగుంట్ల వీరభద్రస్వామి దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గుడిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించారు. నంద్యాల మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా సిబ్బందికి వచ్చిన పక్కా సమాచారం మేరకు బొమ్మలసత్రం వద్ద ఉన్న ఐటీసీ పొగాకు కంపెనీ పక్కనున్న కంప చెట్లలో నిందితులందరూ కలసి దొంగలించిన హుండీ డబ్బులు, వెండి, బంగారం, ఇత్తడి సామాన్లు పంచుకుంటుండగా పోలీసులు మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో దేవాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు వారు విచారణలో అంగీకరించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.70 లక్షలు విలువ చేసే సొమ్ములను స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. దేవుడి సేవ మానేసి.. గుళ్లకు కన్నం వేస్తూ.. మహానంది మండలం పిన్నాపురం గ్రామానికి చెందిన మనోహర్ గ్రామంలోని మద్దిలేటి స్వామి ఆలయంలో పూజారి. భక్తులు ఇచ్చే కానుకలతో సంతృప్తి చెందక.. చోరీలను మార్గంగా ఎంచుకున్నాడు. బేతంచెర్ల, గిద్దలూరు, బనగానపల్లె, అర్దవీడు, గుడివాడ(కృష్ణా జిల్లా), గడివేముల, బండి ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన సాకి వెంకటనారాయణ, నరమేకల గుణమద్దిలేటి, దాసరి నాగరాజు, వెంకటగిరి అశోక్, టెల్లకుల మధుసుధాకర్, జకాటి శైలజ, కాటిపోగు జయపాలు అలియాస్ చిన్న, కుందనం శ్రీకాంత్‌రెడ్డి, వీరశెట్టి వెంకటేశ్వర్లు తదితరులను ముఠాగా ఏర్పాటు చేశాడు. రాత్రివేళల్లో ఆటోల్లో తిరుగుతూ నంద్యాల, సంజామల, ఆళ్లగడ్డ, వెల్దుర్తి, బనగానపల్లె, శిరివెళ్ల, చాగలమర్రి, కోవెలకుంట్ల, గోస్పాడు, డోన్ ప్రాంతాల్లోని దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. సుమారు రూ.1.70 లక్షలు విలువ చేసే హుండీ డబ్బులు, దేవుళ్ల బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, పూజా సామగ్రిని దొంగలించినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. బంగారు, వెండి, ఇత్తడి పూజా సామగ్రి వస్తువులతో పాటు రూ.31 వేల నగదు, నేరానికి ఉపయోగించిన ఏపీ27 వై1278 ఆటోను కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దర్యాప్తును వేగవంతం చేసి దొంగలను అరెస్టు చేసి సొమ్ములు రికవరీ చేసినందుకు నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, త్రీటౌన్ ఎస్ఐలు సూర్యమౌళి, హనుమంతురెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్, కానిస్టేబుల్ కష్ణ తదితరులను ఎస్పీ అభినందించారు. దేవాలయాల వద్ద నిఘాను విస్తతం చేస్తాం : ఎస్పీ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల వద్ద పోలీసు నిఘాను మరింత విస్తతం చేస్తామని ఎస్పీ వెల్లడించారు. ఆలయాల వద్ద భద్రత లోపం లేకుండా ఆలయ కమిటీలు సమన్వయంతో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంత డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఈ మేరకు చర్యలు తీసుకుని గస్తీలు పెంచి నేరాలను నియంత్రించాలని ఆదేశించారు. ప్రముఖ దేవాలయాల వద్ద ఇకపై బీట్ పుస్తకాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడే గ్యాంగ్‌లపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ఎక్కడ అనుమానితులు కనిపించినా డయల్ 100కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు కానిస్టేబుళ్లకు ఎస్పీ చేతుల మీదుగా రివార్డులను అందజేశారు. -
దుర్గాదేవి ఆలయంలో చోరీ
నెల్లికుదురు : మండలంలోని రామన్నగూడెం గ్రామపరిధిలోని దుర్గాదేవి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దుర్గాదేవి మీద ఉన్న రూ. 50 వేల విలువచేసే బంగారు, వెండి ఆభరాణాలతో పా టు ఆలయంలోని సీలింగ్ ఫ్యా¯ŒS ఎత్తుకెళ్లారు. ఆలయం ముందున్న హుండీని పగులగొట్టి డబ్బులను అపహరించారు. శుక్రవారం పూజకు వెళ్లిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారమివ్వడంతో వారు ఎస్సై రాజుకుమార్‌కు ఫిర్యాదు చేయగా ఆలయానికి వెళ్లి పరిశీలించారు. దొంగలను పట్టుకొని చర్య తీసుకోవాల ని సర్పంచ్ కనకం హైమావతి, ఎంపీటీసీ పాశం వీరయ్య, గోపాల్‌రెడ్డి, రమేష్ కోరారు. -
సాయి మందిరంలో చోరీ
సోంపేట: కొర్లాం గ్రామంలో 16వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న షిర్డీ సాయిబాబా మందిర ంలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దేవాలయంలో బాబావారి వెండి పాదుకులు 500 గ్రాములు, వెండి కిరీటం 350 గ్రాములు, వెండి గ్లాసు 150 గ్రాములు కలిపి మొత్తం కిలో వెండి, నాలుగు నెలల హుండీలోని నగదు సుమారు రూ. 8 వేలు చోరీ జరిగినట్టు తెలిపారు. ఆలయ అర్చకుడు ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత దేవాలయానికి తాళాలు వేసి వెళ్లి పోయారని, సోమవారం ఉదయం తిరిగి వచ్చేసరికి తాళాలు పగులు గొట్టి ఉన్నాయని పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్త పెద్దింటి యర్రయ్య ఫిర్యాదు మేరకు బారువ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇచ్ఛాపురం సీఐ అవతారం, సోంపేట ఎస్ఐ భాస్కరరావు, శ్రీకాకుళం క్లూస్ టీం దేవాలయాన్ని పరిశీలించి, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అంతరాష్ట్ర దొంగల పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మహిళకు మజ్జిగ ఇచ్చి..
బరాఖత్‌గూడెం,(మునగాల) : మహిళకు మత్తుపదార్థం కలిపిన మజ్జిక ఇచ్చి పుస్తెలతాడును అపహరించారు. సినీఫక్కీలో జరిగిన ఈ చోరీకి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన కడెం నారాయణమ్మ రెండు రోజుల క్రితం విజయవాడలో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లింది. కాగా, బుధవారం స్వగ్రామానికి వచ్చేందుకు విజయవాడలో బస్సు ఎక్కింది. ఈ క్రమంలో నారాయణమ్మ వెంట ఓ మహిళ విజ యవాడలో బస్సు ఎక్కి పక్కనే కూర్చొని మాటలు కలిపింది. తాను కోదాడ వరకు వస్తానని చెప్పింది. మార్గమధ్యలో నారయణమ్మకు సదరు మహిళ తాగమని మజ్జిగ ఇచ్చింది. నారాయణమ్మ చేదుగా ఉందని కొద్దిగా తాగింది. ఈ లోగా కోదాడ రావడంతో నారాయణమ్మ బస్టాండ్‌లో బస్ దిగి స్వగ్రామం వెళ్లేందుకు సూర్యాపేట వైపు వెళ్లే బస్సు ఎక్కింది. ఈ లోగా ముస్లిం బురకా వేసుకున్న మరో మహిళ వచ్చి నారాయణమ్మ పక్క సీటులో కూర్చుంది. అప్పటికే మైకంతో కళ్లు తిరుగుతున్నట్లనిపించిన నారాయణమ్మ బరాఖత్‌గూడెంలో బస్సు దిగింది. పక్కనే ఉన్న ముసుగు ధరించిన మహిళ నారాయణమ్మను తోడ్కొని గ్రామంలోని ఆమె ఇంటికి చేరుకుంది. ఈ లోగా పూర్తిగా మైకంలోకి వెళ్లిన నారాయణమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును బుర్కా ధరించిన మహిళ తస్కరించింది. అందరూ చూస్తూండగానే బయటకు వచ్చి అక్కడే సిద్ధంగా ఉన్న ఆటోలో కోదాడ వైపు వెళ్లింది. మైకం నుంచి తేరుకున్న నారాయణమ్మ తన మెడలో ఉన్న బంగారు గోలుసు చోరీకి గురైనట్లు గుర్తించి కుటుంబసభ్యులకు తెలి పింది. వారు వెతకకగా నిందితురాలి అడ్రసు లేకుం డా పోయి ంది. లబోదిబోమటూ నారాయణమ్మ కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. -
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో చోరి