
సుద్ లైఫ్ నుంచి గ్యారెంటెడ్ పెన్షన్ ప్లాన్
హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జపాన్‌కు చెందిన దై-చి లైఫ్‌ల జాయింట్ వెంచర్ ‘స్టార్ యూనియన్ దై-చి లైఫ్ ఇన్సూరెన్స్’ (సుద్ లైఫ్) తాజాగా ‘సుద్ లైఫ్ గ్యారెంటెడ్ పెన్షన్ ప్లాన్’ను మార్కెట్‌లోకి తీసుకువ చ్చింది. రిటైర్మెంట్ తర్వాతి జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఈ పాలసీ ఉపయుక్తంగా ఉంటుందని సుద్ లైఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. పాలసీలో ఎలాంటి మెడికల్ చెకప్‌లు ఉండవని పేర్కొంది. వయసు ఆధారంగా పాలసీ టర్మ్, ప్రీమియం చెల్లింపును ఎంపిక చేసుకోవచ్చని వివరించింది. పాలసీలో తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి వయసు 35-65 ఏళ్ల మధ్యలో ఉండాలని తెలిపింది. పదవీ విరమణ సమయంలో పాలసీ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చని పేర్కొంది.