రెప్కో హోమ్‌ జూమ్‌- జూబిలెంట్‌ లైఫ్‌ స్కిడ్‌ | Repco home finance up- Jubilant life sciences down on Q1 results | Sakshi
Sakshi News home page

రెప్కో హోమ్‌ జూమ్‌- జూబిలెంట్‌ లైఫ్‌ స్కిడ్‌

Published Mon, Sep 7 2020 11:35 AM | Last Updated on Mon, Sep 7 2020 11:35 AM

Repco home finance up- Jubilant life sciences down on Q1 results - Sakshi

విదేశీ ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎన్‌బీఎఫ్‌సీ రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో అంటే క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఫలితాలు నిరాశపరచడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి రెప్కో హోమ్‌ కౌంటర్‌  భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. జూబిలెంట్‌ లైఫ్‌ కౌంటర్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

రెప్కో హోమ్‌ ఫైనాన్స్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ నికర లాభం 3 శాతం బలపడి రూ. 69 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 4 శాతం పెరిగి రూ. 342 కోట్లకు చేరింది.  నికర వడ్డీ ఆదాయం రూ. 127 కోట్లను తాకగా.. నిర్వహణ లాభం 11 శాతం క్షీణించి రూ. 86 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో రెప్కో హోమ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసింది. అమ్మేవాళ్లు కరువకావడంతో రూ. 182 సమీపంలో ఫ్రీజయ్యింది.

జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ నికర లాభం 52 శాతం క్షీణించి రూ. 88 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2182 కోట్ల నుంచి రూ. 1893 కోట్లకు నీరసించింది. ఈ నేపథ్యంలో జూబిలెంట్‌ లైఫ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 788 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 772 దిగువకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement