Repco Home Finance Ltd.
-
రెప్కో హోమ్ జూమ్- జూబిలెంట్ లైఫ్ స్కిడ్
విదేశీ ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎన్బీఎఫ్సీ రెప్కో హోమ్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో అంటే క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఫలితాలు నిరాశపరచడంతో హెల్త్‌కేర్ కంపెనీ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి రెప్కో హోమ్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. జూబిలెంట్ లైఫ్ కౌంటర్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రెప్కో హోమ్ ఫైనాన్స్ నికర లాభం 3 శాతం బలపడి రూ. 69 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 4 శాతం పెరిగి రూ. 342 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ. 127 కోట్లను తాకగా.. నిర్వహణ లాభం 11 శాతం క్షీణించి రూ. 86 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో రెప్కో హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసింది. అమ్మేవాళ్లు కరువకావడంతో రూ. 182 సమీపంలో ఫ్రీజయ్యింది. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ నికర లాభం 52 శాతం క్షీణించి రూ. 88 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2182 కోట్ల నుంచి రూ. 1893 కోట్లకు నీరసించింది. ఈ నేపథ్యంలో జూబిలెంట్ లైఫ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 788 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 772 దిగువకు చేరింది. -
ఎన్ఎండీసీ- రెప్కో హోమ్.. జూమ్
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 295 పాయింట్లు జంప్‌చేసి 39,08కు చేరగా.. నిఫ్టీ 76 పాయింట్లు ఎగసి 11,635 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా పీఎస్‌యూ దిగ్గజం ఎన్ఎండీసీ లిమిటెడ్, మార్టిగేజ్ సంస్థ రెప్కో హోమ్ ఫైనాన్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎండీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో కోవిడ్-19 నేపథ్యంలో ఎన్ఎండీసీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 55 శాతం క్షీణించి రూ. 533 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 3264 కోట్ల నుంచి రూ. 1938 కోట్లకు పడిపోయింది. అయితే లాక్‌డవున్‌ల కాలంలోనూ అంచనాలకు అనుగుణమైన పనితీరు చూపినట్లు ఎన్ఎండీసీ చైర్మన్ సుమీత్ దేవ్ పేర్కొన్నారు. ఇకపై మెరుగైన పనితీరును ప్రదర్శించగలమని అంచనా వేశారు. ఈ నెల మొదట్లో కంపెనీ ముడిఇనుము ధరలను టన్నుకి రూ. 300 చొప్పున పెంచింది. దీంతో టన్ను ధర రూ. 2,950కు చేరింది. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎన్ఎండీసీ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 109 వద్ద ట్రేడవుతోంది. రెప్కో హోమ్ ఫైనాన్స్ రెప్కో హోమ్ ఫైనాన్స్ కంపెనీలో వాటాను ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ 4.86 శాతం నుంచి 6.14 శాతానికి పెంచుకున్నట్లు తాజాగా వెల్లడైంది. జూన్ చివరికల్లా రెప్కో హోమ్ ఫైనాన్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, డీఎస్పీ, హెచ్డీఎఫ్సీ స్మాల్‌క్యాప్ ఫండ్స్ వరుసగా 2.36 శాతం, 4.44 శాతం, 5.97 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెప్కో హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 186.5 వద్ద ఫ్రీజయ్యింది. గత 10 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ షేరు 35 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
ఉద్యోగాలు
రెప్కో హోమ్ ఫైనాన్స్ రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నికల్ ఆఫీసర్: 8 అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్‌తో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. చివరి తేది: అక్టోబర్ 6 వెబ్సైట్: http://www.repcohome.com ఓఎన్జీసీ గుజరాత్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నికల్ అసిస్టెంట్ (కెమిస్ట్ట్రీ): 17 అర్హతలు: కెమిస్ట్రీలో పీజీ ఉండాలి. అసిస్టెంట్ టెక్నీషియన్: 171 విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, మెకానికల్, బాయిలర్. అసిస్టెంట్ రిగ్‌మెన్ (డ్రిల్లింగ్): 37 అసిస్టెంట్ (గ్రేడ్ -3): 2 అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. నర్స్ (గ్రేడ్ - 3): 1 అర్హతలు: నర్సింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. సెక్యూరిటీ సూపర్వైజర్: 2 అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ. జూనియర్ అసిస్టెంట్: 22 అర్హతలు: బీకామ్ లేదా బీఎస్సీ (ఎంపీసీ) ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (స్టెనో-ఇంగ్లిష్): 10 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 5 అర్హతలు: బీఎస్సీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్: 244 అర్హత: పదో తరగతి. చివరి తేది: అక్టోబర్ 15 వెబ్సైట్: www.ongcindia.com