
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో సాఫ్ట్‌వేర్ సేవల రంగ కంపెనీ మాస్టెక్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇండియా కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఆటుపోట్ల మార్కెట్‌లో మాస్టెక్ లాభాలతో జోరు చూపుతుంటే.. ఎస్‌ఐఎస్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..
మాస్టెక్ లిమిటెడ్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో మాస్టెక్ నికర లాభం 20 శాతం పెరిగి రూ. 46.5 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 15 శాతం పుంజుకుని రూ. 386 కోట్లను అధిగమించింది. ఇక త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహణ లాభం 12 బలపడి రూ. 85 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు యథాతథంగా 21.1 శాతంగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మాస్టెక్ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 523 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వరకూ ఎగసింది.
ఎస్‌ఐఎస్ ఇండియా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎస్‌ఐఎస్ ఇండియా నికర లాభం 24 శాతం క్షీణించి రూ. 57 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం పుంజుకుని రూ. 2167 కోట్లను తాకింది. ఇబిటా 3 శాతం తక్కువగా రూ. 121 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌ఐఎస్ షేరు 4.4 శాతం పతనమై రూ. 344 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment