ప్యాకేజింగ్ రంగంలోని పలు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో నష్టాల మార్కెట్లోనూ ప్యాకేజింగ్ రంగ కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి కాస్మో ఫిల్మ్స్(రూ. 491) షేరు సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. ఎస్సెల్ ప్రొప్యాక్(రూ. 300), జిందాల్ పాలీఫిల్మ్(రూ. 524), యూఫ్లెక్స్(రూ. 373), ఈస్టర్ ఇండస్ట్రీస్(రూ. 76.5), హైటెక్ కార్ప్(రూ. 126.5), పాలీప్లెక్స్ కార్పొరేషన్(రూ. 844), యూఫ్లెక్స్(రూ. 373) తాజాగా 52 వారాల గరిష్టాలను తాకాయి. ఇందుకు ప్రధానంగా కాస్మో ఫిల్మ్స్, ఎస్సెల్ ప్రొప్యాక్, యూఫ్లెక్స్ సాధించిన పటిష్ట ఫలితాలు దోహదం చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వెరసి కంట్రోల్ ప్రింట్, హిందుస్తాన్ టిన్‌వర్క్స్, ఎవరెస్ట్ కాంటో, హటమకీ తదితర కంపెనీల షేర్లు జోరు చూపుతున్నాయి.
ఫలితాలు ఇలా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కాస్మో ఫిల్మ్స్ నికర లాభం 69 శాతం జంప్‌చేసి రూ. 47 కోట్లకు చేరింది. ఇక ఎస్సెల్ ప్రొప్యాక్ నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 46 కోట్లను తాకింది. ఇక యూఫ్లెక్స్ నికర లాభం సైతం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 197 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి.
షేర్ల స్పీడ్
ఎన్‌ఎస్‌ఈలో కంట్రోల్ ప్రింట్ 16 శాతం పురోగమించి రూ. 251కు చేరగా.. జిందాల్ పాలీ 12.4 శాతం దూసుకెళ్లి రూ. 524ను తాకింది. ఈ బాటలో ఎవరెస్ట్ కాంటో షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 32 వద్ద, ఎస్సెల్ ప్రొప్యాక్ 5 శాతం ఎగసి రూ. 295 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో హటమకీ పీపీఎల్ 5 శాతం పుంజుకుని రూ. 260 వద్ద, పాలీప్లెక్స్ కార్పొరేషన్ 5.5 శాతం జంప్‌చేసి రూ. 844 వద్ద కదులుతున్నాయి. ఇదే విధంగా ఈస్టర్ ఇండస్ట్రీస్ 5 శాతం లాభపడి రూ. 76.5ను తాకగా, హైటెక్ కార్ప్ 5 శాతం పెరిగి రూ. 126.5కు చేరింది. యూఫ్లెక్స్ 4 శాతం బలపడి రూ. 373 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment