హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ ఉత్పత్తుల లిస్టెడ్ సంస్థ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు రూ. 230 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇందులో సింహభాగం నిధులను గ్రూప్ సంస్థ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌లో ప్రస్తుత ఫర్నేస్‌లను ఆధునీకరించేందుకు, అధునాతన టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తోంది. ఏజీఐ గ్రీన్‌ప్యాక్ సీఈవో రాజేశ్ ఖోస్లా ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా గ్లాస్ ప్యాకేజింగ్ మార్కెట్ 2024లో 67.28 బిలియన్ డాలర్లు ఉండగా 2032 నాటికి 93.69 బిలియన్ డాలర్లకు చేరే అంచనాలు ఉన్నాయని ఖోస్లా వివరించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ భువనగిరిలోని తమ స్పెషాలిటీ గ్లాస్ ప్లాంటుతో పాటు ఇతరత్రా ఉత్పత్తి సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. గ్లాస్ ప్యాకేజింగ్ ఉత్పత్తులను ఇప్పటికే అమెరికాకు ఎగుమతి చేస్తుండగా కొత్తగా మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలో కూడా అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్‌సీఎల్‌టీకి చేరిన హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం తమ టర్నోవరు రూ. 2,421 కోట్లుగా ఉందని ఖోస్లా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment