న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది క్యూ1లో రూ. 4,335 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఏప్రిల్–జూన్(రూ. 3,501 కోట్లు)తో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 21 శాతంపైగా ఎగసి రూ. 21,873 కోట్లను తాకింది. టారిఫ్‌ల పెంపు మెరుగైన పనితీరుకు సహకరించింది. నికరంగా 9.7 మిలియన్ యూజర్లు జత కలిశారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 41.99 కోట్లకు చేరింది.
ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) త్రైమాసికంగా 5 శాతం బలపడి రూ. 175.7కు చేరింది. అత్యంత వేగవంత సర్వీసులందించగల 5జీ స్పెక్ట్రమ్‌కు వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో జియో వెల్లడించిన ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. టెలికం, డిజిటల్ బిజినెస్‌లతో కూడిన జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 24% పుంజుకుని రూ. 4,530 కోట్లయ్యింది. ఆదాయం 24% వృద్ధితో రూ. 27,527 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment