సాక్షి,ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం మధ్య ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీ జూన్ త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదుచేసింది. జూలై 24 తో ముగిసిన తొలి త్రైమాసికంలో పన్నుల తర్వాత ఏకీకృత లాభంలో 25 శాతం క్షీణించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సాధించిన 3,437 కోట్ల రూపాయల లాభంతో పోలిస్తే 2,567 కోట్లను సాధించింది.
ఏకీకృత ఆదాయం 2020 10,478.46 కోట్లుగా ఉందని ఐటీసీ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిందిఅంతకుముందు ఏడాది కాలంలో 12,657.90 కోట్ల రూపాయలతో పోలిస్తే ఆదాయం 17 శాతం తగ్గింది. సిగరెట్ల వ్యాపారంఈ త్రైమాసికంలో 4,330.05 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది, ఏడాది క్రితం ఇది 6,141.92 కోట్ల రూపాయలు. అలాగేఅంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 411.60 కోట్లు సాధించిన హోటళ్ల వ్యాపార ఆదాయం 4.92 కోట్లకు పడిపోయింది. ఇతర ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్ ఆదాయం 3,378.84 కోట్లుగా ఉండగా, ఏడాది క్రితం 3,068.07 కోట్లుగా ఉంది. మరోవైపు, ఈ త్రైమాసికంలో వ్యవసాయ వ్యాపారం లాభపడిందని ఐటీసీ ప్రకటించింది. ఏడాది క్రితం 3,622.40 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 3,764.56 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment