బజాజ్‌ హెల్త్‌కేర్- శ్రేఈ ఇన్‌ఫ్రా.. జూమ్ | Bajaj healthcare- Srei infra finance zooms on Q1 results | Sakshi
Sakshi News home page

బజాజ్‌ హెల్త్‌కేర్- శ్రేఈ ఇన్‌ఫ్రా.. జూమ్

Published Tue, Sep 15 2020 12:21 PM | Last Updated on Tue, Sep 15 2020 12:21 PM

Bajaj healthcare- Srei infra finance zooms on Q1 results - Sakshi

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా రంగ కంపెనీ బజాజ్‌ హెల్త్‌కేర్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో నష్టాల నుంచి బయటపడి లాభాలు ఆర్జించడంతో ఎన్‌బీఎఫ్‌సీ.. శ్రేఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

బజాజ్‌ హెల్త్‌కేర్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో బజాజ్‌ హెల్త్‌కేర్‌ నికర లాభం 5 రెట్లు ఎగసి రూ. 15 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 52 శాతం వృద్ధితో రూ. 140 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.5 శాతం మెరుగుపడి 18.76 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో బజాజ్‌ హెల్త్‌కేర్‌ షేరు బీఎస్‌ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లింది. రూ. 498ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 13 శాతం జంప్‌చేసి రూ. 469 వద్ద ట్రేడవుతోంది. 

శ్రేఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో శ్రేఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ రూ. 23 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ1లో రూ. 69 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1561 కోట్ల నుంచి రూ. 1214 కోట్లకు క్షీణించింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 44,213 కోట్లకు చేరింది. ఫలితాల ప్రభావంతో శ్రేఈ ఇన్‌ఫ్రా షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 10 శాతం దూసుకెళ్లింది. రూ. 7.90ను తాకింది. ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 7.70 వద్ద ట్రేడవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement