ఫైనాన్స్‌ వ్యాపారి దుర్మార్గం:దంపతులపై కత్తితో దాడి | couple attacked by finance dealer | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ వ్యాపారి దుర్మార్గం:దంపతులపై కత్తితో దాడి

Published Mon, May 19 2014 8:41 AM | Last Updated on Tue, Oct 2 2018 6:32 PM

couple attacked by finance dealer

గుంటూరు: నాగరిక సమాజంలో అనైతిక దాడులు రోజురోజుకు శృతిమించుతూనే ఉన్నాయి.  అప్పులు ఇవ్వడం, తిరిగి వారివద్ద నుంచి  వడ్డీల రూపంలో భారీగా గుంజటం మనకు తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆంక్షలు ఉన్నా ఫైనాన్సియర్ల నైజంలో ఏమాత్రం మార్పు రావడంలేదు. అప్పు తీర్చలేదని ఓ దంపతులపై కత్తితో దాడి చేసిన ఘటన జిల్లాలోని బాపట్లలో కలకలం సృష్టించింది. ఒక ఫైనాన్స్ సంస్థలో అప్పు రూపంలో తీసుకున్న డబ్బును ఆ దంపతులు తిరిగిచెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో భార్యకు తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement