attack on couple
-
నా భార్యే కారణం: మనోహరచారి
సాక్షి, హైదరాబాద్: కూతురు, అల్లుడిపై పాశవికంగా దాడి చేసిన మనోహరచారిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనబడటం లేదు. తనకు చెప్పకుండా పెళ్లి చేసుకుందన్న అక్కసుతోనే దాడికి పాల్పడినట్టు చెప్పాడు. మనోహరచారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు గురువారం అతడిని నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. దాడి ఎందుకు చేశావన్న ప్రశ్నకు మనోహరచారి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. తన కూతురు మాధవిని చంపాలనుకున్నానని ఒకసారి, భయపెట్టాలనుకున్నానని మరోసారి చెప్పాడు. అసలు దీనంతటికి కారణం తన భార్య అని, ఆమెను చంపితే సరిపోయేదన్నాడు. అల్లుడు సందీప్ మంచోడేనని కితాబిచ్చాడు. ‘నాకు మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకున్న నా బిడ్డను చంపాలనుకున్నా. ఒకమాట చెబితే నేనే పెళ్లి చేసేవాణ్ని. చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చూసుకున్నా. నాకు వచ్చిన డబ్బులన్నీ ఆమెకు ఇచ్చేవాణ్ని. కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటే నన్నే మోసం చేసి వెళ్లిపోయింది. బట్టలు కొనడానికి రమ్మని చెప్పలేదు. బయటకు రమ్మని చెప్పానంతే. భయపెట్టిద్దామనుకున్నా. మద్యం మత్తులో ఉండటం వల్ల దాడి చేశాను. ఆమె బతకాలి. తొందరపడి తప్పుచేశా. మాధవి ప్రేమ విషయం నా భార్యకు తెలుసు. ఆమె నాకు ఒక మాట చెప్పాలి కదా? సందీప్ కొంచెం మంచోడే. అంకుల్ అని నన్ను పిలిచేవాడ’ని మనోహరచారి పేర్కొన్నాడు. -
కులాంతర వివాహం చేసుకుందని ప్రేమ జంటపై దాడి
-
దాడి చేసింది కన్న కొడుకే....
గుంటూరు : అప్పు తీర్చలేదన్న కోపంతో వృద్ధ దంపతులపై వడ్డీ వ్యాపారి దాడి ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రిక్షా కార్మికుడైన రాంబాబు, అతడి భార్య పార్వతమ్మలను కన్నకొడుకే కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో వృద్ధులిద్దరూ గాయపడగా .. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా బాపట్ల కొట్రావారివీధి నివాసి రాంబాబు తరచూ అప్పులు చేస్తుండడం, ఆ అప్పులు తీర్చమంటూ అందరూ ఇంటికి వచ్చి గొడవలు చేయడం, అతడి కొడుకు శ్రీనివాసరావుకు నచ్చలేదు. దీంతో అసలు తల్లిదండ్రులు లేకపోతే .. ఈ రచ్చే ఉండదనుకున్నాడు. పీకల్దాకా తాగొచ్చిన శ్రీనివాసరావు, ఆ మైకంలో కత్తితో తల్లిదండ్రులను గాయపరిచాడు. ఈ ఘటనలో గాయపడిన రాంబాబు అసలు విషయం చెబితే ఎక్కడ కొడుకుపై కేసు అవుతుందోనని భయపడి .. మీడియా ఎదుట వడ్డీ వ్యాపారి దాడి చేశాడంటూ చెప్పాడు. దాంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. -
ఫైనాన్స్ వ్యాపారి దుర్మార్గం:దంపతులపై కత్తితో దాడి
గుంటూరు: నాగరిక సమాజంలో అనైతిక దాడులు రోజురోజుకు శృతిమించుతూనే ఉన్నాయి. అప్పులు ఇవ్వడం, తిరిగి వారివద్ద నుంచి వడ్డీల రూపంలో భారీగా గుంజటం మనకు తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆంక్షలు ఉన్నా ఫైనాన్సియర్ల నైజంలో ఏమాత్రం మార్పు రావడంలేదు. అప్పు తీర్చలేదని ఓ దంపతులపై కత్తితో దాడి చేసిన ఘటన జిల్లాలోని బాపట్లలో కలకలం సృష్టించింది. ఒక ఫైనాన్స్ సంస్థలో అప్పు రూపంలో తీసుకున్న డబ్బును ఆ దంపతులు తిరిగిచెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో భార్యకు తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దంపతులపై దాడి 5 లక్షల దోపిడి