దాడి చేసింది కన్న కొడుకే.... | Son attacks parents in guntur district | Sakshi
Sakshi News home page

దాడి చేసింది కన్న కొడుకే....

Published Mon, May 19 2014 2:44 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Son attacks parents in guntur district

గుంటూరు : అప్పు తీర్చలేదన్న కోపంతో వృద్ధ దంపతులపై వడ్డీ వ్యాపారి దాడి ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రిక్షా కార్మికుడైన రాంబాబు, అతడి భార్య పార్వతమ్మలను కన్నకొడుకే కత్తితో  పొడిచాడు. ఈ ఘటనలో వృద్ధులిద్దరూ గాయపడగా .. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా బాపట్ల కొట్రావారివీధి నివాసి రాంబాబు తరచూ అప్పులు చేస్తుండడం, ఆ అప్పులు తీర్చమంటూ అందరూ ఇంటికి వచ్చి గొడవలు చేయడం, అతడి కొడుకు శ్రీనివాసరావుకు నచ్చలేదు.

దీంతో అసలు తల్లిదండ్రులు లేకపోతే .. ఈ రచ్చే ఉండదనుకున్నాడు. పీకల్దాకా తాగొచ్చిన శ్రీనివాసరావు, ఆ మైకంలో కత్తితో తల్లిదండ్రులను గాయపరిచాడు. ఈ ఘటనలో గాయపడిన రాంబాబు అసలు విషయం చెబితే ఎక్కడ కొడుకుపై కేసు అవుతుందోనని భయపడి .. మీడియా ఎదుట వడ్డీ వ్యాపారి దాడి చేశాడంటూ చెప్పాడు. దాంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement